e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 18, 2021
Home News మే 2 త‌ర్వాత మ‌ళ్లీ పెట్రో షాక్..?

మే 2 త‌ర్వాత మ‌ళ్లీ పెట్రో షాక్..?

మే 2 త‌ర్వాత మ‌ళ్లీ పెట్రో షాక్..?

న్యూఢిల్లీ : అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడిచ‌మురు ధ‌ర‌లు పెరుగుతున్నా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండు నెల‌లుగా పెట్రో ధ‌ర‌ల‌ను స‌వ‌రించ‌లేదు. మే 2న ఎన్నిక‌ల ఫ‌లితాల తర్వాత పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు భారం కానున్నాయి. పెట్రోల్, డీజిల్ ధ‌ర‌ల‌ను లీట‌ర్ కు రెండు నుంచి మూడు రూపాయ‌ల మేర ద‌శ‌ల‌వారీగా పెంచవ‌చ్చ‌ని భావిస్తున్నారు.

అంత‌ర్జాతీయ మార్కెట్ లో ముడిచ‌మురు ధ‌ర‌ల పెరుగుద‌ల, డాల‌ర్ తో రూపాయి విలువ ప‌త‌నం కావ‌డంతో ఎదురైన న‌ష్టాల‌ను పూడ్చుకునేందుకు చ‌మురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రో ధ‌ర‌ల‌ను పెంచ‌నున్నాయి. ఫిబ్ర‌వ‌రి 27 నుంచి పెట్రో ధ‌ర‌ల‌ను పెంచ‌క‌పోవ‌డంతో త్వ‌ర‌లోనే పెట్రో షాక్ ల‌కు వాహ‌న‌దారులు సిద్ధం కావాల‌నే సంకేతాలు వెల్ల‌డ‌వుతున్నాయి. మే 2న అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన అనంత‌రం పెట్రోల్ ధ‌ర‌ల పెంపు మ‌ళ్లీ ముందుకు రానుంది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
మే 2 త‌ర్వాత మ‌ళ్లీ పెట్రో షాక్..?

ట్రెండింగ్‌

Advertisement