కరోనా తర్వాత బంగారం కొనుగోలుపై నగరవాసుల ఆలోచన ఇలా ఉందా?

Gold price | కరోనా ప్రభావిత పరిస్థితులు తగ్గుతున్న నేపథ్యంలో ఈసారి దీపావళికి బంగారం కొనాలన్న ఆకాంక్ష పెరుగుతున్నది. రాబోయే మూడు నెలల్లో పుత్తడిని కొనాలని దాదాపు 28 శాతం నగరవాసులు భావిస్తున్నట్లు ఓ తాజా సర్వేలో తేలింది. మార్కెట్ రిసెర్చ్ సంస్థ ‘యూగౌవ్స్’ దివాలీ స్పెండింగ్ ఇండెక్స్ ప్రకారం పసిడిపై కొనుగోలుదారుల్లో ఆసక్తి పెరిగినట్లు స్పష్టమైంది. గతేడాది కొవిడ్-19 దెబ్బకు దేశీయంగా రత్నాలు, ఆభరణాల పరిశ్రమ కుదేలైన విషయం తెలిసిందే. ఈ ఏడాది జనవరి-మార్చిలో తిరిగి కోలుకుంటున్న సంకేతాలు కనిపించినా.. సెకండ్ వేవ్ ముంచుకొచ్చింది. అయితే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా ఆంక్షల్ని ఎత్తివేస్తుండటంతో ఇప్పుడిప్పుడే సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో ఈసారి పండుగ సీజన్‌పై వ్యాపారులు భారీ ఆశల్నే పెట్టుకుంటున్నారు. కాగా, గత నెల 17-20 తేదీల్లో దేశవ్యాప్తంగా 2,021 మంది అభిప్రాయాలతో ఆన్లైన్ వేదికగా ఈ సర్వేను యూగౌవ్ ఓమ్నీబస్ చేపట్టింది.
సర్వే ముఖ్యాంశాలు
- బంగారం కొనాలని లేదా ప్రముఖ సంస్థల పసిడి పథకాల్లోనైనా చేరాలని 58% మంది యోచిస్తున్నారు
- నగల రూపంలోగానీ, గోల్డ్ ఫండ్స్ ద్వారాగానీ పుత్తడిపై పెట్టుబడులు పెట్టాలని 38% అనుకుంటున్నారు
- వ్యక్తిగత వినియోగానికి బంగారం కొనాలని యువత కంటే నడి వయస్కులే 61% ఎక్కువగా భావిస్తున్నారు
- బంగారం కొనేందుకు దీపావళి, ఈ పండుగ సీజనే సరైన సమయమని 69% మంది అభిప్రాయపడుతున్నారు
- హాల్‌మార్క్ గుర్తింపు, ఆఫర్లకు ప్రాధాన్యం (71%, 50%) ఇస్తున్న తూర్పు రాష్ర్టాల వినియోగదారులు
- మేకింగ్ చార్జీలపైనే ఎక్కువ (46%)గా దృష్టి పెడుతున్న దక్షిణాది రాష్ర్టాల కొనుగోలుదారులు
- బంగారం కొనే విషయంలో స్నేహితులు, కుటుంబసభ్యుల మాట వింటున్న 24% పురుషులు, 10% మహిళలు
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
బ్యాంకులో అకౌంట్ ఉందా? ఒకటో తేదీ నుంచి ఈ రూల్స్ మారబోతున్నాయి.. అవేంటో తెలుసా
హైదరాబాద్ టు ముంబై.. 3 గంటలే జర్నీ.. ఎలాగో తెలుసా?!
బ్యాడ్ బ్యాంకుకు లక్ష కోట్ల ఫ్రాడ్ లోన్స్.. ఆర్బీఐ అనుమతికి ఎదురుచూపులు
చిప్ కొరతతో భారత్‌కు న్యూ మోడల్స్ సరఫరాల్లో తీవ్ర జాప్యం!
కరోనా తర్వాత బంగారం కొనుగోలుపై నగరవాసుల ఆలోచన ఇలా ఉందా?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

