ఓ సైనికుడి తిరుగుబాటు
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో టీ-సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు.
ప్రభాస్ కథానాయకుడిగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న పీరియడ్ యాక్షన్ డ్రామా ‘ఫౌజీ’. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో టీ-సిరీస్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రంలో ఇమాన్వి కథానాయికగా నటిస్తున్నారు. శుక్రవారం ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా చిత్రబృందం ‘ఫైల్ నంబర్ 25’ పేరుతో ప్రత్యేక గ్లింప్స్‌ను విడుదల చేసింది. రెండో ప్రపంచ యుద్ధం నేపథ్యంలో సాగే ఈ కథలో 1942లో బెర్లిన్‌లో నేతాజీ సుభాష్ చంద్రబోస్, అడాల్ఫ్ హిట్లర్ మధ్య జరిగిన సమావేశాన్ని చూపించారు. భారత స్వాతంత్య్ర పోరాటానికి జర్మనీ మద్దతు కోరే క్రమంలో నేతాజీ ఓ రహస్య భారతీయ సైనికుడి గురించి వెల్లడిస్తారు.
బ్రిటిష్ నిఘా వ్యవస్థను తన వ్యూహాలతో ముప్పుతిప్పలు పెడుతూ, సైనిక కార్యకలాపాలను దెబ్బతీస్తున్న ఆ వీరుడి అసలు గుర్తింపు ఎవరికీ తెలియదు. భగవద్గీత స్ఫూర్తితో రూపొందించిన రహస్య సమాచార వ్యవస్థ అతడి ప్రత్యేకతగా గ్లింప్స్‌లో చూపించారు.చివర్లో ప్రభాస్ భారీ తుపాకీతో, సిగరెట్ నోటిలో పెట్టుకుని కనిపిస్తూ తనదైన మాస్ యాక్షన్‌తో ఆకట్టుకున్నారు. బ్రిటిష్ పాలనకు తలొగ్గని తిరుగుబాటుదారుడిగా ఆయన పాత్ర ఆసక్తిని పెంచుతోంది.ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 29న తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, బెంగాలీ భాషల్లో విడుదల కానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

