‘ఆదర్శ కుటుంబం’ ఊహలకు అందని సినిమా
‘మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజులు తిరిగిరావు. ఎంజాయ్ చేయండి. కానీ క్యారెక్టర్ మాత్రం ముఖ్యం. దాన్ని కాపాడుకోండి. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీస్‌తో వచ్చి ఈ సినిమా చూడండి’ అని అగ్ర కథానాయకుడు వెంకటేశ్ అన్నారు.
‘మిమ్మల్ని చూస్తుంటే నా కాలేజ్ రోజులు గుర్తొస్తున్నాయి. ఆ రోజులు తిరిగిరావు. ఎంజాయ్ చేయండి. కానీ క్యారెక్టర్ మాత్రం ముఖ్యం. దాన్ని కాపాడుకోండి. ఇక ఈ సినిమా విషయానికొస్తే.. మీ అందరికీ సినిమా నచ్చుతుంది. ఫ్యామిలీస్‌తో వచ్చి ఈ సినిమా చూడండి’ అని అగ్ర కథానాయకుడు వెంకటేశ్ అన్నారు. ఆయన హీరోగా రూపొందిన ఫ్యామిలీ థ్రిల్లర్ ‘ఆదర్శకుటుంబం – AK 47’. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎస్.రాధాకృష్ణ(చినబాబు) నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 30న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నది.
ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్ మల్లారెడ్డి కాలేజ్‌లో విద్యార్థుల సమక్షంలో నిర్వహించిన ఈ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో వెంకటేశ్ మాట్లాడారు. చిత్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ మాట్లాడుతూ ‘మీరంతా ఊహించినట్టు కాకుండా, వేరే విధంగా ఉండే సినిమా ఇది. నార్మల్ రొమాంటిక్ కామెడీ అంశాలతోపాటు వేరే అంశాలను కూడా ఇందులో చర్చించాం. క్రైమ్ కామెడీ ట్రై చేయడం నాకూ, వెంకీ గారికి ఫస్ట్‌టైమ్. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నా’ అని ఆశాభావం వెలిబుచ్చారు. ఇంకా నిర్మాత ఎస్.రాధాకృష్ణ, కథానాయిక శ్రీనిధిశెట్టి, సంగీత దర్శకుడు తమన్ తదితర చిత్ర బృందమంతా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

