IPhone13 : చిప్ కొరతతో భారత్‌కు న్యూ మోడల్స్ సరఫరాల్లో తీవ్ర జాప్యం!

న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా చిప్ కొరత భారత్‌లో లేటెస్ట్ ఐఫోన్ 13 సిరీస్ సరఫరాలను దెబ్బతీస్తోంది. స్టోర్లు, ఆన్లైన్ మార్కెట్ ప్లేస్ల్లో ఉన్న కొద్దిపాటి స్టాక్స్ అమ్ముడవగా ఇప్పుడు ఐఫోన్ 13 సిరీస్ కోసం కస్టమర్లు ఐదు వారాలు వేచిచూడాల్సిన పరిస్ధితి నెలకొందని రిటైలర్లు, పరిశ్రమ ఎగ్జిక్యూటివ్‌లు చెబుతున్నారు. కంపెనీకి చెందిన ఆన్లైన్ స్టోర్ సైతం ఒకటి నుంచి ఐదు వారాల వరకూ డెలివరీలో జాప్యం ఉంటుందని చూపడం గమనార్హం.

అధిక డిమాండ్ ఉన్న ఖరీదైన ఐఫోన్ 13 ప్రొ, 13 ప్రొ మ్యాక్స్ వెయిటింగ్ పిరియడ్ మరింత అధికంగా ఉంది. ఐఫోన్ 13 సిరీస్ సరఫరలాలు పరిమితంగా ఉన్నాయని, రానున్న కొద్ది వారాలు డిమాండ్‌కు అనుగుణంగా సరఫరాలు తగినంతగా ఉండవని డీలర్లు చెబుతున్నారు.

ఐఫోన్ లాంఛ్ అయ్యే సందర్భాల్లో సరఫరాల సమస్య ముందుకు రావడం మామూలేనని, ఈసారి సరఫరాలపై అనిశ్చితి, సుదీర్ఘ నిరీక్షణ కొనసాగే క్రమంలో ఏ మోడల్ అందుబాటులోకి ఎప్పుడు ఉంటుందనేది చెప్పలేని పరిస్థితి ఉందని డీలర్లు పేర్కొంటున్నారు.

చైనా, తైవాన్, వియత్నాం, ఫిలిప్పీన్స్ వంటి దేశాల్లో యాపిల్ సహా పలు విడిభాగాల తయారీ యూనిట్లపై ఊహించని దాని కంటే అధికంగా ప్రభావం పడటం, చిప్‌ల కొరత వెంటాడటం సరఫరాలు, స్టాక్ లభ్యతను ప్రభావితం చేసిందని చెబుతున్నారు. చిప్సెట్ నుంచి ఇతర కీలక పరికరాల వరకూ విడిభాగాల కొరత రవాణా సమస్యలు ఐఫోన్ న్యూ మోడల్స్ కొరతకు దారితీసిందని ఐడీసీ ఇండియా రీసెర్చి డైరెక్టర్ నవ్కేందర్ సింగ్ పేర్కొన్నారు.

Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

