హాలీవుడ్లో సినిమా చేస్తా!
‘బాహుబలి’ ఫ్రాంఛైజీ, ‘ఆర్ఆర్ఆర్'చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటిన అగ్ర దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ సినిమా దర్శకత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కనీసం ఒక్క హాలీవుడ్ సినిమాకైనా దర్శకత్వం వహించాలన్నది తన లక్ష్యమని తెలిపారు.
‘బాహుబలి’ ఫ్రాంఛైజీ, ‘ఆర్ఆర్ఆర్’చిత్రాలతో అంతర్జాతీయ స్థాయిలో భారతీయ సినిమా సత్తాను చాటిన అగ్ర దర్శకుడు రాజమౌళి హాలీవుడ్ సినిమా దర్శకత్వంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్తులో కనీసం ఒక్క హాలీవుడ్ సినిమాకైనా దర్శకత్వం వహించాలన్నది తన లక్ష్యమని తెలిపారు. బ్రెజిల్లో జరుగుతున్న 50వ సావో పాలో అంతర్జాతీయ చలనచిత్రోత్సవంలో పాల్గొన్న ఆయన పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు.
‘హాలీవుడ్ చిత్ర నిర్మాణ విధానం, ప్రణాళికాబద్ధంగా సినిమాను పూర్తి చేసే పని సంస్కృతి నుంచి ఎంతో నేర్చుకోవచ్చు.‘ఆర్ఆర్ఆర్’ తర్వాత పలు హాలీవుడ్ సినిమా అవకాశాలొచ్చాయి. అయితే అప్పటికే ‘వారణాసి’ తాలూకు ప్రీప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి. ఒకే సమయంలో నేను రెండుమూడు చిత్రాలపై దృష్టిపెట్టలేను. ‘వారణాసి’ పూర్తయ్యాక హాలీవుడ్ అవకాశాల గురించి తప్పకుండా ఆలోచిస్తాను’ అని రాజమౌళి పేర్కొన్నారు. మహేశ్‌బాబు కథానాయకుడిగా రాజమౌళి రూపొందిస్తున్న ‘వారణాసి’ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకురానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

