Nita Ambani | రిలయన్స్ ఫౌండేషన్ ఛైర్పర్సన్ నీతా అంబానీ (Nita Ambani) కలల ప్రాజెక్ట్ అయిన నీతా ముఖేశ్ అంబానీ కల్చరల్ (Nita Mukesh Ambani Cultural Centre) సెంటర్ శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ముంబై (Mumbai) లోని జియో వరల్డ్ సెంటర్ (Jio World Centre)లో ఏర్పాటు చేసిన ఈ ప్రారంభోత్సవ వేడుకలు మూడు రోజుల పాటు జరగనున్నాయి. దేశ కళారంగాన్ని, సాంస్కృతిక వైభవాన్ని, సంప్రదాయ కళలను ప్రోత్సహించడంలో భాగంగా ముఖేశ్ అంబానీ భార్య నీతా అంబానీ ఈ కల్చరల్ సెంటర్‌ను తీర్చిదిద్దారు.
ఈ వేడుకల్లో అంబానీ కుటుంబం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్‌గా నిలిచింది. ముకేశ్ అంబానీ-నీతా అంబానీ, ఆకాశ్ అంబానీ (Akash Ambani) -శ్లోకా మెహతా (Shloka Mehata) , కాబోయే జంట అనంత్ అంబానీ (Anant Ambani), రాధికా మర్చంట్ (Radhika Merchant) ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ఇక నీతా-ముకేశ్‌ల ముద్దుల కుమార్తె ఈషా అంబానీ (Isha Ambani) ఈ వేడుకల్లో అందరి దృష్టిని ఆకర్షించారు.
ఈ ప్రారంభోత్సవ వేడుకలకు రాజకీయ, క్రీడ, సినీ, పారిశ్రామికవేత్తలెందరో తరలివచ్చారు. అగ్రనటుడు రజనీకాంత్ తన కుమార్తె సౌందర్యతో కలిసి ఈ వేడుకల్లో పాల్గొన్నారు. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్, ఆయన సతీమణి గౌరీ ఖాన్, కుమారుడు ఆర్యన్ ఖాన్, కుమార్తె సుహానా ఖాన్, సల్మాన్ ఖాన్, సిద్ధార్థ్-కియారా అడ్వాణీ దంపతులు, దీపికా పదుకొణె-రణ్వీర్ సింగ్, ప్రియాంకా చోప్రా-నిక్ జొనాస్, ఐశ్వర్యరాయ్, ఆలియా భట్, సోనమ్ కపూర్, జాన్వీ కపూర్, శ్రద్ధాకపూర్, సైఫ్ అలీఖాన్-కరీనా కపూర్ దంపతులు, కరిష్మా కపూర్, షాహిద్ కపూర్ ఆయన సతీమణి మీరా రాజ్‌పుత్, ఆమిర్ ఖాన్, కరణ్ జోహార్ తదితర స్టార్ నటీనటులు ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు.
క్రికెట్ దిగ్గజం సచిన్ టెందూల్కర్ (Sachin Tendulkar) తన సతీమణి అంజలి, కూతురు సారా (Sara) టెండూల్కర్‌తో కలిసి వచ్చి.. ఈ కార్యక్రమంలో సందడి చేశారు. అలాగే ఒలింపిక్ బంగారు పతక విజేత అభినవ్ బింద్రా, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, అథ్లెట్ దీపా మాలిక్ వంటివారితో పాటు హాలీవుడ్‌కు చెందిన పలువురు ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి.
nita ambani once again dancing on shreya ghoshal's version of bhajans 🤍 true fan#NitaMukeshAmbaniCulturalCentre pic.twitter.com/k8g7qj6q4w
— aditi (@IamARichBrat) March 31, 2023
Sachin Tendulkar makes a grand entrance with wife Anjali & daughter Sarah at NMACC launch event #sachintendulkar #sarahtendulkar #mumbai #mukeshambani #NMACC #nmacclaunch #nitaambani #nitamukeshambaniculturecentre pic.twitter.com/HhrYEBCEOm
— News18 (@CNNnews18) March 31, 2023
Stars come together at the grand launch of #NitaMukeshAmbaniCultureCentre#CultureAtTheCentre #NMACC pic.twitter.com/VPGFVlamMt
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023
Uddhav Thackeray with family at the grand opening of the #NitaMukeshAmbaniCulturalCentre#CultureAtTheCentre #NMACC@AUThackeray pic.twitter.com/PIm41zG1Hl
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023
Devendra Fadnavis with Amruta Fadnavis at the grand opening of the #NitaMukeshAmbaniCulturalCentre#CultureAtTheCentre #NMACC pic.twitter.com/f3fVgMilON
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023
Nita M Ambani and Mukesh Ambani at the grand opening of #NitaMukeshAmbaniCulturalCentre, a multi-faceted venue that honours art and culture, bringing together the best of India and the world.
#CultureAtTheCentre #NMACC pic.twitter.com/b44TXbwWP3
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023
— Nita Mukesh Ambani Cultural Centre (@nmacc_india) March 31, 2023
Also Read..
IPL 2023 | ఐపీఎల్ ఆరంభ వేడుకల్లో మార్మోగిన తెలుగు పాటలు.. ‘నాటు నాటు’కు స్టెప్పులేసిన రష్మిక
India Corona | 24 గంటల్లో 2,994 కొత్త కేసులు.. ఐదుగురు మృతి