సోమవారం 03 ఆగస్టు 2020
Business - Jul 07, 2020 , 17:26:42

ఇక ఓలా చెల్లింపులు ఫోన్‌పేతో చేయెచ్చు

ఇక ఓలా చెల్లింపులు ఫోన్‌పేతో చేయెచ్చు

న్యూఢిల్లీ : ఓలా క్యాబ్‌  వినియోగదారులు ఇకపై ఫోన్‌పే ద్వారా తమ డిజిటల్‌ చెల్లింపులు చేయెచ్చు. దీనికి సంబంధించి సోమవారం  ఓలా క్యాబ్‌, ఫోన్‌పే సంస్థతో వ్యూహాత్మక భాగస్వాయ్యాన్ని ప్రకటించింది. 

ఓలా వినియోగదారులు ఆండ్రాయడ్‌ ఫోన్‌ ద్వారా ఫోన్‌పే చెల్లింపులు కొనసాగించవచ్చు. త్వరలో ఐఓఎస్‌ ఓఎస్‌ ఫోన్‌తో చెల్లింపులు ప్రారంభమవుతాయి.

ఫోన్‌ పే ద్వారా చెల్లింపులతో ఓలా కొత్త డిజిటల్‌ సేవలను దేశమంతటా విస్తరించనుంది.  ఫోన్‌పేతో ఓలా జట్టు కట్టడంతో డిజిటల్‌ సేవ రంగంలో మరింత దూసుకుపోతామని ఓలా ప్రతానిధి ఆనండ్‌ సుబ్రమణియన్‌ ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ భాగస్వామ్యంతో ఫోన్‌పే లక్షల సంఖ్యలో  ఓలా వినియోగదారులకు దగ్గర కానుంది.

ఓలాతో నిర్మణాత్మక భాగస్వామ్యంతో సరికొత్త అనుభుతులను ఫోన్‌పే సర్విస్‌ అందించనుంది. వినియోగదారులు సులభ పద్ధతిలో చెల్లింపులకు ఫోన్‌పే కృషి చేస్తుందని ఫోన్‌పే బిజినెస్‌ డెవలప్‌మెంట్‌ డైరెక్టర్‌ అంకిత్‌ గౌర్‌ పేర్కొన్నారు.

ఓలా వినియోగదారులకు మొదటి రెండుప్రయాణాలు ఫోన్‌పే చెల్లింపులో సుమారు రూ. 200 వరకు క్యాష్‌బ్యాక్‌ ఆఫర్‌ వర్తింస్తోందని ఓలా తెలిపింది.logo