Ola Electric | ప్రముఖ విద్యుత్ ద్విచక్ర వాహన తయారీ సంస్థ ఓలా ఎలక్ట్రిక్ (Ola Electric) తన ఉద్యోగులకు (Employees) షాక్ ఇచ్చింది. పేలవమైన సేల్స్, సర్వీసింగ్‌పై కస్టమర్ల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్న తరుణంలో కొలువుల కోతకు (Lay Off) సిద్ధమైంది. సంస్థలో పనిచేస్తున్న దాదాపు 500 మందిపై వేటు వేయాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలిసింది. లాభాల మార్జిన్, లాభదాయకతను మెరుగుపరచడం కోసం పునర్నిర్మాణంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా కార్యకలాపాల సామర్థ్యాన్ని కూడా పెంచేందుకు చర్యలు అవసరమని కంపెనీ భావిస్తున్నట్టు తెలిసింది. ఈ మేరకు సంబంధిత వర్గాలను ఊటంకిస్తూ మీడియాలో వరుస కథనాలు వస్తున్నాయి.
కాగా, ప్రస్తుతం ఓలా ఎలక్ట్రిక్ పలు వివాదాలతో సతమతమవుతోన్న విషయం తెలిసిందే. సంస్థ కార్యకలాపాలు, సేవలపై వాహనదారుల నుంచి ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారుల హక్కులు ఉల్లంఘన, తప్పుదోవ పట్టించే ప్రకటనలు, అన్యాయమైన వాణిజ్య పద్ధతులు అనుసరిస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. ఈ విషయంపై సెంట్రల్ కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ ఓలా ఎలక్ట్రిక్‌కు షోకాజ్ నోటీసులు కూడా జారీ చేసింది. అంతేకాదు సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కమెడియన్ కునాల్ కమ్రా, భవీశ్ అగర్వాల్ మధ్య వివాదం కూడా నెలకొన్న విషయం తెలిసిందే. ఈ పరిణామాల నేపథ్యంలో సంస్థ లేఆఫ్స్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
Also Read..
Nagarjuna | నాగచైతన్య – శోభిత పెళ్లి.. ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఇచ్చిన నాగార్జున