Vladimir Putin | కిమ్‌కు మరిన్ని బహుమతులు.. సింహం, ఎలుగుబంట్లు, బర్రెలు పంపిన రష్యా అధ్యక్షుడు పుతిన్
Vladimir Putin | రష్యా-ఉత్తర కొరియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న కిమ్‌కు పుతిన్ (Vladimir Putin) బహుమతులు (Gifts) పంపుతున్నారు.
Vladimir Putin | రష్యా-ఉత్తర కొరియా దేశాల మధ్య బంధం మరింత బలపడుతోంది. ఉక్రెయిన్ యుద్ధం నేపథ్యంలో రష్యాకు ఉత్తర కొరియా అధినేత కిమ్ (Kim Jong Un) పెద్ద ఎత్తున ఆయుధ సహకారం అందిస్తున్న విషయం తెలిసిందే. మరో లక్ష బలగాలను క్రెమ్లిన్‌కు పంపేందుకు కిమ్ అంగీకారం తెలిపారని తెలిసింది. ఈ నేపథ్యంలో ఉక్రెయిన్‌తో యుద్ధంలో తమకు అన్ని విధాలుగా సాయం అందిస్తున్న కిమ్‌కు పుతిన్ (Vladimir Putin) బహుమతులు (Gifts) పంపుతున్నారు.
ఇప్పటికే అరుదైన జాతి గుర్రాలు, శునకాలు, మేకల్ని పంపిన పుతిన్.. తాజాగా మరికొన్నింటిని గిఫ్ట్స్‌గా పంపారు. ఏకంగా 70కిపైగా జంతువులను బహుమతిగా పంపినట్లు తెలిసింది. ఇందులో ఒక ఆఫ్రికన్ సింహం, రెండు ఎలుగుబంట్లు, రెండు జడల బర్రెలు, ఐదు తెల్ల కోకాటూలు, 25 రకాల నెమల్లు, 40 మాండరిన్ బాతులు ఉన్నాయి. వీటన్నింటినీ ప్యాంగ్యాంగ్ సెంట్రల్ జూకు తరలించినట్లు తెలిసింది.
కాగా, కిమ్‌కు పుతిన్ ఇలా బహుమతులు పంపడం ఇదేమీ మొదటి సారి కాదు. రెండు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరిన క్రమంలో ఇరు దేశాల అధినేతలు ఒకరికొకరు గిఫ్ట్‌లు ఇచ్చుకుంటున్నారు. రెండేళ్ల క్రితం 30 ఒర్లావో ట్రోటర్ గుర్రాల్ని కిమ్‌కు అందజేశారు. కిమ్ ఈ ఏడాది జూన్‌లో పుతిన్‌కు అరుదైన శునకాల్ని బహుమతిగా పంపగా, పుతిన్ ఆగస్టులో కిమ్‌కు 447 మేకల్ని బహుమతిగా పంపారు.
రష్యాకు లక్ష ఉత్తర కొరియా బలగాలు!
తన మిత్రదేశమైన రష్యాకు మరిన్ని బలగాలను పంపడానికి ఉత్తర కొరియా నిర్ణయించింది. ఉక్రెయిన్‌తో రష్యా జరుపుతున్న యుద్ధంలో సహాయంగా లక్ష బలగాలను ఆ దేశానికి పంపేందుకు ఆ దేశ అధినేత కిమ్ అంగీకారం తెలిపారని తెలిసింది. దశలవారీగా వీరిని పంపనున్నట్టు సమాచారం. ఇప్పటికే రష్యాకు 15 వేల మంది ఉత్తరకొరియా సైనికులకు కిమ్ పంపారు. దీనిపై పొరుగుదేశమైన దక్షిణ కొరియా, అమెరికా అభ్యంతరాలు చెప్తున్నా ఆయన లెక్కచేయడం లేదు. కిమ్ చర్యలతో ఉక్రెయిన్, మిత్రదేశాలు ఉలిక్కిపడుతున్నాయి. ఈ చర్య ఇండో పసిఫిక్ రీజియన్‌పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తమవుతున్నది.
Also Read..
Adani bribery case | అదానీ వ్యవహారంపై స్పందించిన అగ్రరాజ్యం అమెరికా
Canada Vs India | భారత్ ఆగ్రహంతో వెనక్కి తగ్గిన కెనడా.. ఆ కథనాల్లో వాస్తవం లేదంటూ ప్రకటన
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
Night Routine Habits | రాత్రి ఈ 6 పనులు చేస్తున్నారా? మీ జీవితంలో అద్భుతమైన మార్పు ఖాయం!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

