న్యూఢిల్లీ: ఎథేర్, బజాజ్ చేతక్ స్కూటర్లకు గట్టి పోటీ ఇచ్చే క్యాబ్స్ అగ్రిగేటర్ ఓలా అనుబంధ ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ ఆవిష్కరణ ( Ola Electric Scooter Launhing ) కు ముహూర్తం ఖరారైంది. దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఆగస్టు 15వ తేదీన విపణిలోకి ఆవిష్కరిస్తున్నట్లు సీఈవో భవిష్ అగర్వాల్ మంగళవారం ట్వీట్ చేశారు. ఇప్పటికే దేశ ప్రజలంతా ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
సాధ్యమైనంత త్వరలో ఎలక్ట్రిక్ స్కూటర్ డిజైన్, ఆప్షన్లు పూర్తి వివరాలను వెల్లడిస్తామని భవిష్ అగర్వాల్ పేర్కొన్నారు. ఆ దిశగా ముందడుగు వేస్తున్నామని, తమ స్కూటర్ కోసం బుకింగ్స్ నమోదు చేసుకున్న వారందరికీ ధన్యవాదాలు అని తెలిపారు.
గత నెల 15న ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల కోసం బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. దాని పట్ల ప్రజలు ఆసక్తితో ఉన్నారనడానికి బుకింగ్స్ ప్రారంభమైన 24 గంటల్లోనే లక్షకు పైగా రిజిస్ట్రేషన్లు నమోదయ్యాయి. స్పీడ్, రేంజ్, బూట్ స్పేస్‌తోపాటు టెక్నాలజీలో ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ క్లాసిక్‌గా ఉంటుందని ఓలా తెలిపింది. ప్రజలందరికీ అందుబాటులో ఉండేటా విస్త్రుత స్థాయిలో ఆమోదయోగ్యమైన ధర నిర్ణయిస్తామని పేర్కొంది.
2022లో కోటి స్కూటర్ల ఉత్పత్తి లక్ష్యం..
తమిళనాడులో టూ వీలర్ ఫ్యాక్టరీ కొలువు దీరింది. ఓలా ఫ్యూచర్ ఫ్యాక్టరీ తొలి దశ నిర్మాణం పూర్తి కావచ్చింది. త్వరలో ఉత్పాదక కార్యక్రమాలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది కోటి స్కూటర్లను విపణిలోకి విడుదల చేయాలని లక్ష్యంతో ముందుకు సాగుతున్నది ఓలా ఎలక్ట్రిక్.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
Ola bookings|.. రూ.499 చెల్లిస్తే సరి.. ఈ-స్కూటర్ రెడీ..!
ఓలా ఈ-స్కూటర్‌ను ఎలా నడుపాలో తెలుసా..?!
Home Buyers for Discounts | బంగారం వద్దు.. సొంతిల్లే ముద్దు.. బట్ డిస్కౌంట్లకు డిమాండ్!
PAN mandatory | ఈ ఆర్థిక లావాదేవీలకు పాన్ నమోదు తప్పనిసరి!
Home Loan Tips | ఈ పంచ సూత్రాలు పాటిస్తే హోంలోన్ ఈజీ.. ఎలాగంటే?!
వొడాఫోన్ ఐడియాలో నా వాటా ఇచ్చేస్తా: కుమార మంగళం బిర్లా