PAN mandatory | ఈ ఆర్థిక లావాదేవీలకు పాన్ నమోదు తప్పనిసరి!
PAN mandatory | దేశంలోని అత్యంత ముఖ్యమైన ఫైనాన్సియల్ డాక్యుమెంట్లకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) తప్పనిసరి అవసరం.....

PAN mandatory | దేశంలోని అత్యంత ముఖ్యమైన ఫైనాన్సియల్ డాక్యుమెంట్లకు పర్మినెంట్ అకౌంట్ నంబర్ (పాన్) తప్పనిసరి అవసరం. పాన్ అంటే పది అంకెల ఏకీక్రుత ఆల్ఫాన్యూమరిక్ నంబర్. దీన్ని ఆదాయం పన్ను (ఐటీ) శాఖ జారీ చేస్తుంది. ప్రతి ఒక్కరి ఆర్థిక లావాదేవీలను ఐటీ శాఖ తెలుసుకునేందుకు ఈ నంబర్ ఉపయోగిస్తుంది.
ఐటీఆర్.. టీడీఎస్.. టీసీఎస్ లావాదేవీలు..
పన్ను చెల్లింపులు, టీడీఎస్, టీసీఎస్ క్రెడిట్స్ తదితర చెల్లింపులు, లావాదేవీలకు, ఉత్తర, ప్రత్యుత్తరాలకు పాన్‌కార్డును ఉపయోగిస్తుంది ఐటీ శాఖ. పన్ను చెల్లింపుదారుల వివిధ రకాల పెట్టుబడులు, అప్పులు, ఇతర బిజినెస్ లావాదేవీల సమాచారం తేలిగ్గా సేకరించడానికి పాన్ ఉపకరిస్తుంది. పన్ను ఎగవేత, అనుమానాస్పద లావాదేవీలు ఉన్నాయా.. లేవా.. అనే విషయాన్ని తేలుస్తుంది.
ఈ నిబంధన కింద పాన్ నమోదు
స్పెసిఫైడ్ ఫైనాన్సియల్ లావాదేవీలకు పాన్ నంబర్ నమోదు చేయడం తప్పనిసరి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కాన్సులేట్ ఆఫీసులు మినహా ప్రతి ఒక్కరూ కొన్ని లావాదేవీలకు పాన్ నంబర్ పేర్కొనడం ఐటీ చట్టంలోని 114 బీ నిబంధన తప్పనిసరి చేస్తుంది. ఆ లావాదేవీలివే:
ద్విచక్ర వాహనం మినహా మోటార్ వెహికల్ లేదా వెహికిల్ క్రయ విక్రయాలు
బ్యాంకు లేదా కోఆపరేటివ్ బ్యాంకులో ఖాతా ప్రారంభం
క్రెడిట్ లేదా డెబిట్ కార్డు కోసం చేసే దరఖాస్తు
డీమ్యాట్ ఖాతా తెరవడానికి పాన్ తప్పనిసరి.
రెస్టారెంట్ లేదా హోటల్లో ఒకసారి రూ.50 వేలు దాటిన బిల్లు చెల్లింపు..
ఒకసారి విదేశీ ప్రయాణానికి, విదేశీ కరెన్సీ కొనుగోళ్లు రూ.50వేల ఖర్చు దాటినప్పుడు..
మ్యూచువల్ ఫండ్ కొనుగోళ్లు రూ.50 వేలు దాటితే..
డిబెంచర్లు లేదా బాండ్ల కొనుగోలుకు రూ.50 వేల పై చిలుకు ఖర్చు చేస్తే..
రూ. 50 వేల పై చిలుకుతో రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) బాండ్ల కొనుగోలు.
కోఆపరేటివ్ బ్యాంకులో ఒకరోజు రూ.50వేలు దాటిన డిపాజిట్లపైన..
2016 నవంబర్ 9 నుంచి డిసెంబర్ 30 వరకు రూ.2.50 లక్షల పై చిలుకు నగదు డిపాజిట్.
రూ.50 వేల పై చిలుకు బ్యాంకు డ్రాఫ్ట్‌లు, పే ఆర్డర్ల కొనుగోలు.. లేదా బ్యాంకు చెక్‌లు జారీ చేసినా..
కంపెనీల చట్టం 2013లో 406 సెక్షన్ ప్రకారం బ్యాంకు, పోస్టాఫీసు, ఆర్థిక సంస్థలో ఒకసారి రూ.50 వేలు దాటినా, ఏడాదిలో రూ.5 లక్షలు దాటినా
ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.50 వేలకు పైగా బీమా ప్రీమియం చెల్లింపులు
రూ.10 లక్షలు దాటిన స్థిరాస్తుల విక్రయం లేదా కొనుగోలు.
వస్తువులు లేదా సేవల క్రయ విక్రయాలకు రూ.2 లక్షలపై చిలుకు ఖర్చు చేస్తే..
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి:
Conflict in Hero Family| హీరో ఫ్యామిలీలో రచ్చ.. ‘ముంజాల్స్’లో విభేదాలు.. ఎందుకంటే?!
Oxygen : చరిత్రలో ఈరోజు.. 247 ఏండ్ల క్రితం ఆక్సీజన్ కనిపెట్టిన ప్రీస్ట్లీ
Asaduddin Owaisi: మోదీకి హిందూ మహిళల సాధికారత అక్కర్లేదా..?
TS Cabinet : వచ్చే ఏడాది నుంచి కొత్త మెడికల్ కాలేజీలు ప్రారంభం
TS Cabinet : 5 సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు త్వరలోనే శంకుస్థాపన
Sai Pallavi Tamil | కోలీవుడ్ కమ్‌బ్యాక్ కు సాయి పల్లవి ప్లాన్..?
పుష్ప2 లో నెగెటివ్ రోల్ చేయనున్న సోనూసూద్.. ప్రేక్షకులు అంగీకరిస్తారా..!
Hyderabad biryani | హైదరాబాదీ బిర్యానీ ఒక్కటేనా.. ఈ పది బిర్యానీల రుచి చూశారా
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Arunachal Anti-Dam Protest | డ్యామ్‌కు వ్యతిరేకంగా నిరసనలు.. కార్యాలయం, పలు వాహనాలకు నిప్పు
ఇల్లెందు నియోజకవర్గంలో బీఆర్ఎస్లో చేరికలు
Talasani srinivas Yadav | పట్టభద్రులు అందరూ ఓటర్లుగా నమోదు చేసుకోవాలి : మాజీ మంత్రి తలసాని శ్రీనివాస యాదవ్
Swayambhu | విజువల్ ఎఫెక్ట్స్ పనులు.. నిఖిల్ ‘స్వయంభూ’ విడుదల మరింత ఆలస్యం!
NZvIND: ఇండియా టార్గెట్ 181
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

