Oil Price | దేశానికి చెందిన చమురు కంపెనీల లాభం భారీగా పెరిగింది. మార్చి నుంచి పెట్రోల్‌పై లీటర్‌కు రూ.15, డీజిల్‌పై రూ.12 లాభం వస్తున్నది. ఈ సమయంలో ముడి చమురు బ్యారెల్‌కు 84 డాలర్ల నుంచి 72 డాలర్ల దిగువకు చేరింది. వాస్తవానికి కంపెనీలు ధరలను తగ్గించి ప్రజలపై భారాన్ని తగ్గించేందుకు చాలా అవకాశం ఉన్నది. ముడి చముర ధర బ్యారెల్‌కు 71.31 డాలర్లకు చేరింది. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గుముఖం పడుతుండగా.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ.60వేలకోట్ల దిగుమతి బిల్లు ఆదా కానున్నది. అయినా ధరలను తగ్గించేందుకు ఆసక్తి చూపడం లేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు కావాలంటే లాభాలు ఇవ్వొచ్చని.. చాలాకాలంగా ధరలు స్థిరంగా ఉంటున్నాయని ఐసీఆర్ఏ నివేదిక పేర్కొంటున్నది. ఇన్వెస్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ అండ్ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ నివేదిక ప్రకారం.. మార్చి నుంచి క్రూడ్ ధర 12శాతం పతనమైంది.
సౌదీ అరేబియా ధరలను తగ్గించేందుకు సిద్ధమవుతోందని పలు నివేదికలు పేర్కొంటున్నాయి. ఈ క్రమంలో రాబోయే కాలంలో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. దేశీయ ఆయిల్ కంపెనీల లాభాలు మరింత పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. క్రూడాయిల్ బ్యారెల్‌కు డాలర్ తగ్గితే భారత్‌కు దిగుమతి బిల్లులపై వార్షికంగా రూ.13వేలకోట్లు ఆదా అవుతుంది. ఆర్థిక సర్వే 2024 ఈ ఆర్థిక సంవత్సరంలో ముడి చమురు సగటు ధర బ్యారెల్‌కు 84 డాలర్లుగా ఉండవచ్చని అంచనా వేసింది. అయితే, ప్రస్తుతం బ్యారెల్‌కు 70 నుంచి 75 డాలర్ల మధ్య పలుకుతున్నది. ఇదే సమయంలో ధరలను స్థిరీకరించినట్లయితే ఈ ఆర్థిక సంవత్సరంలో భారత్ మరింత బిల్లును మరింత ఆదా చేయగలదని నిపుణులు పేర్కొంటున్నారు. ఫలితంగా ద్రవ్యోల్బణం తగ్గుతుందని.. పెట్టుబడులకు అవకాశం ఉంటుందని అంచనా వేస్తున్నారు. దేశానికి చెందిన ప్రధాన మూడు చమురు కంపెనీలు భారత్ పెట్రోలియం, హిందుస్థాన్ పెట్రోలియం, ఇండియన్ ఆయిల్ సంస్థలు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.81వేలకోట్ల లాభాన్ని ఆర్జించాయి. ఇందులో ఇండియన్ ఆయిల్ రూ.39,619 కోట్లు, భారత్ పెట్రోలియం రూ.26,673 కోట్లు, హిందుస్థాన్ పెట్రోలియం రూ.14,694 కోట్లు వెనుకేసుకున్నాయి.