Nokia Layoffs | టెక్ దిగ్గజాల్లో కొనసాగుతున్న కొలువుల కోత : 14,000 మంది ఉద్యోగులపై నోకియా వేటు
టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ (Nokia Layoffs) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి.
న్యూఢిల్లీ : టెక్ దిగ్గజాల్లో లేఆఫ్స్ (Nokia Layoffs) ప్రకంపనలు కొనసాగుతున్నాయి. ఆర్ధిక మందగమనం, మాంద్యం భయాలతో పలు కంపెనీలు పెద్దసంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తూనే ఉన్నాయి. తాజాగా ఖర్చులు తగ్గించుకునే క్రమంలో 14,000 మంది ఉద్యోగులపై వేటు వేయనున్నట్టు నోకియా వెల్లడించింది.
ఉత్తర అమెరికా సహా కీలక మార్కెట్లలో 5జీ పరికరాలకు డిమాండ్ తగ్గడంతో నోకియా థర్డ్ క్వార్టర్ సేల్స్ 20 శాతం పడిపోయిన నేపధ్యంలో లేఆఫ్స్ వార్తలు వెలువడటం గమనార్హం. ఆపరేషన్స్‌ను క్రమబద్ధీకరించడంతో పాటు ఖర్చులకు కళ్లెం వేసేందుకు 14,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్టు నోకియా గురువారం ఓ ప్రకటనలో పేర్కొంది. 2026 నాటికి 14 శాతం నిర్వహణ లాభాలను ఆర్జించే లక్ష్యంతో నోకియా పలు చర్యలు చేపడుతోంది.
తాజా లేఆఫ్స్‌తో కంపెనీ ఉద్యోగుల సంఖ్య 72,000కు తగ్గనుంది. లేఆఫ్స్‌తో కంపెనీకి పెద్దమొత్తంలో నిధులు ఆదా అవుతాయని నోకియా లెక్కగడుతోంది. నోకియానే కాకుండా మైక్రోసాఫ్ట్, గూగుల్, మెటా, ట్విట్టర్ వంటి ప్రముఖ టెక్ కంపెనీలు ఖర్చులను తగ్గించకుని, వ్యాపార పునర్వ్యవస్ధీకరణ చేపట్టేందుకు వేలాది ఉద్యోగులను తొలగించాయి.
Read More :
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

