Nirmala on Coal Shortage | దేశవ్యాప్తంగా బొగ్గు కొరత ఉన్నదన్న వార్తలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొట్టి పారేశారు. ఈ వార్తలు పూర్తిగా నిరాధారం. భారత్ మిగులు విద్యుత్ కల దేశం అని వ్యాఖ్యానించారు. విద్యుత్‌శాఖ మంత్రి ఆర్కే సింగ్ కేవలం రెండు రోజుల క్రితం నాటి రికార్డుల ఆధారంగా చెప్పి ఉంటారని, కానీ అది నిరాధారం అని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్లో జరిగిన ఓ సదస్సులో పేర్కొన్నారు. ఇతర నిల్వల్లో కొరత వల్ల దేశీయ అవసరాలకు అనుగుణంగా విద్యుత్ సరఫరాలో అకస్మాత్‌గా అంతరాయం ఏర్పడి ఉండవచ్చునన్నారు.
వచ్చే నాలుగు రోజుల వరకు దేశంలోని ప్రతి పవర్ ప్లాంట్ విద్యుత్ ఉత్పత్తి చేస్తుందని, విద్యుత్ సరఫరా నెట్‌వర్క్‌లో ఎటువంటి అంతరాయం ఏర్పడలేదన్నారు. భారత్‌లో విద్యుత్ కొరత, బొగ్గు నిల్వలు తగ్గిపోయినట్లు వార్తలొచ్చాయని హార్వర్డ్ కెన్నెడీ స్కూల్ ప్రొఫెసర్ లారెన్స్ సమ్మర్స్ అడిగిన ప్రశ్నకు మంత్రి నిర్మలా సీతారామన్ పై విధంగా సమాధానమిచ్చారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఐఫోన్13కు చిప్‌ల కొరత.. యాపిల్ షేర్లు పతనం
Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? సగటు వ్యక్తి జీవితకాలం కష్టపడినా అంత రాదు!!
రూ 15 లక్షల లోపు రానున్న టాప్ ఎలక్ట్రిక్ కార్లు ఇవే..!