శాన్ఫ్రాన్సిస్కో: యాపిల్ కంపెనీ షేర్లు ఒక్కసారిగా పడిపోయాయి. చిప్‌ల కొరత వల్ల ఐఫోన్13 ఉత్పత్తిని తగ్గిస్తున్నట్లు వస్తున్న వార్తలతో ఆ కంపెనీ షేర్లు డౌన్ అయినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది చివరి త్రైమాసికంలో ఆ కంపెనీ సుమారు 90 మిలియన్ల ఐఫోన్లు తయారు చేయాల్సి ఉంది. అయితే ఉత్పత్తి సంఖ్యను 10 మిలియన్ల యూనిట్లకు తగ్గిస్తున్నట్లు యాపిల్ సంస్థ తన భాగస్వాములకు తెలియజేయనున్నది. ఈ నేపథ్యంలో ఆ కంపెనీ షేర్లు చాలా వేగంగా క్షీణించాయి. ఈ వార్తలు వ్యాపించిన తక్షణమే 1.2 శాతం మేర యాపిల్ షేర్లు పడిపోయాయి. బ్రాడ్‌కామ్, టెక్సాస్ సంస్థలు యాపిల్‌కు సకాలంలో చిప్‌లను డెలివరీ చేయని కారణంగా, ఆ కంపెనీ షేర్లు కూడా పతనమయ్యాయి. ఐపోన్13 మోడల్స్‌ను సెప్టెంబర్‌లో యాపిల్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. ఐఫోన్13, ఐఫోన్13 మినీ, ఐఫోన్13 ప్రో, ఐఫోన్13 ప్రోమ్యాక్స్లకు సెప్టెంబర్ 17 ఆర్డర్లు స్టార్ట్ అయ్యాయి. వాటిని 24వ తేదీ నుంచి షిప్పింగ్ స్టార్ట్ చేశారు.