Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Hyderabad | హైదరాబాద్ మహానగరాన్ని మంచినీటి కొరత ముప్పు వెంటాడుతోంది. నగరానికి నీటిని అందించే సింగూరు, మంజీరా జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలు మరో 42 రోజులకు మాత్రమే సరిపోనున్నాయి.
Hyderabad | హైదరాబాద్ మహానగరాన్ని మంచినీటి కొరత ముప్పు వెంటాడుతోంది. నగరానికి నీటిని అందించే సింగూరు, మంజీరా జలాశయాల్లో ప్రస్తుతం ఉన్న నిల్వలు మరో 42 రోజులకు మాత్రమే సరిపోనున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే డిసెంబర్ తర్వాత నగరంలోని పలు ప్రాంతాలకు నీటి సరఫరాలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.
సింగూరు, మంజీరా జలాశయాల నుంచి నీటి సరఫరా జరిగే ప్రాంతాలపై కొరత ప్రభావం పడే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. శేరిలింగంపల్లి, పటాన్చెరు, జూబ్లీహిల్స్, కూకట్పల్లి, సనత్‌నగర్, రాజేంద్రనగర్, ఖైరతాబాద్ నియోజకవర్గాల్లో నీటి సరఫరా కష్టతరంగా మారవచ్చని భావిస్తున్నారు. వీటిలో ముఖ్యంగా శేరిలింగంపల్లి నియోజకవర్గంపై ప్రభావం ఎక్కువగా ఉండొచ్చని హెచ్చరికలు వెలువడుతున్నాయి.
సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి నిల్వలు తగ్గుతున్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులు దృష్టి సారించారు. ప్రస్తుతం ఈ రెండు జలాశయాల నుంచి నీళ్లు సరఫరా అవుతున్న ప్రాంతాలకు గోదావరి జలాలను మళ్లించే అవకాశాలను పరిశీలిస్తున్నారు. ఇందుకు సంబంధించిన ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. సకాలంలో ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోతే నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాపై ప్రభావం పడే ప్రమాదం ఉందని భావిస్తున్నారు.
ఈ నేపథ్యంలో గోదావరి జలాల వినియోగంపై నిపుణులు కీలక ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. సుమారు ఆరు నెలల క్రితం గోదావరి నీటిని కిందకు వదలకుండా నిల్వ చేసుకుని ఉంటే ప్రస్తుత పరిస్థితి ఎదురయ్యేది కాదని వారు అభిప్రాయపడుతున్నారు. నీటి లభ్యత, భవిష్యత్తు అవసరాలను ముందుగానే అంచనా వేసి జలవనరుల నిర్వహణ చేపట్టాల్సి ఉండేదని విమర్శిస్తున్నారు.
Read Today's Latest Hyderabad News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | డిసెంబర్ వరకే హైదరాబాద్‌కు నీళ్లు.. ఆ తర్వాత తీవ్ర కొరత తప్పదా?
Microsoft: మైక్రోసాఫ్ట్ 365 సేవల్లో అంతరాయం.. 5 గంటలు స్తంభించిన వివిధ అప్లికేషన్లు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

