Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
Tejaswini | నందమూరి అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త. నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని త్వరలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. అయితే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారా? లేక తెరవెనుక ఉంటూ సినిమాలకు సంబంధించిన బాధ్యతలు చేపడతారా? అనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి.
Tejaswini | నందమూరి అభిమానులకు ఒక ఆసక్తికరమైన వార్త. నటసింహం నందమూరి బాలకృష్ణ కుమార్తె తేజస్విని త్వరలోనే సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టబోతున్నారనే ప్రచారం గత కొంతకాలంగా జోరుగా సాగుతోంది. అయితే ఆమె హీరోయిన్గా ఎంట్రీ ఇస్తారా? లేక తెరవెనుక ఉంటూ సినిమాలకు సంబంధించిన బాధ్యతలు చేపడతారా? అనే విషయంలో రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ముఖ్యంగా ఇటీవల తేజస్విని డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఆమె నటిగా వెండితెరకు పరిచయం కాబోతున్నారనే ప్రచారం మరింత పెరిగింది. కానీ తాజాగా వినిపిస్తున్న సమాచారం మాత్రం అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.
తాజా సమాచారం ప్రకారం తేజస్విని నటిగా కాకుండా పూర్తిస్థాయి నిర్మాతగా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నారట. ఒక విభిన్నమైన కథాంశంతో తెరకెక్కనున్న సినిమాను నిర్మించేందుకు ఆమె సన్నాహాలు చేస్తున్నట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. తన క్లాస్మేట్ భువన్ దర్శకత్వంలో ఈ ప్రాజెక్ట్ రూపొందనుందని తెలుస్తోంది. కథ, కథనాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటూ, కొత్త తరహా కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలని తేజస్విని భావిస్తున్నట్లు సమాచారం. ఈ సినిమాలో యువ నటుడు అన్వేష్ హీరోగా నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు సింధూరపువ్వు కృష్ణారెడ్డి తనయుడైన అన్వేష్ ఈ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారట. ఇక ఈ సినిమాలో మరో ప్రత్యేక ఆకర్షణగా ప్రముఖ నటుడు బాబీ సింహా కనిపించనున్నట్లు సమాచారం. ఆయన ఓ కీలక పాత్ర పోషించనున్నారని టాక్. దీంతో యువ హీరోతో పాటు అనుభవజ్ఞుడైన నటుడు కూడా భాగం కావడం ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిని పెంచుతోంది.
ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి కూడా ఓ ఆసక్తికరమైన అప్డేట్ వినిపిస్తోంది. నవంబర్ 23న విశాఖపట్నంలోని గీతం ఇంజినీరింగ్ కాలేజీలో చిత్రీకరణ ప్రారంభం కానుందని సమాచారం. అక్కడే తొలి షెడ్యూల్‌ను ప్లాన్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ ప్రాజెక్టుకు సంబంధించిన అధికారిక ప్రకటన, ఇతర నటీనటులు, సాంకేతిక బృందం వివరాలు వెల్లడికావాల్సి ఉంది. ఇప్పటివరకు బాలకృష్ణ కుటుంబానికి సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే ఎక్కువగా కనిపించిన తేజస్విని, ఇప్పుడు సినిమా నిర్మాణ బాధ్యతలు చేపట్టనున్నారనే వార్త ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఇప్పటికే బాలకృష్ణ సినిమాలకు సంబంధించిన పలు వ్యవహారాల్లో ఆమె కీలకంగా వ్యవహరించినట్లు సినీ వర్గాల్లో చర్చ ఉంది. ఇప్పుడు స్వతంత్రంగా ఓ సినిమాను నిర్మించేందుకు ముందుకు వస్తున్నారనే ప్రచారం నందమూరి అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tejaswini | హీరోయిన్గా కాదు,నిర్మాతగా ఎంట్రీకి తేజస్విని రెడీ.. బాలయ్య కుమార్తె కొత్త ప్లాన్ ఇదే!
IND vs NZ | కివీస్ జోరుకు భారత బౌలర్ల బ్రేకులు.. 20 ఓవర్లలో మూడు వికెట్లు డౌన్
Allu Sneha Reddy | అల్లు అర్జున్ సతీమణి స్నేహారెడ్డికి అరుదైన గౌరవం.. అభినందనల వెల్లువ!
IND vs NZ | చెలరేగిన టిమ్ సీఫెర్ట్.. తొలి 10 ఓవర్లలో కివీస్ స్కోర్ 72/0
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ ఇంటికి బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసు బృందాలు!
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

