e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home News అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? స‌గ‌టు వ్య‌క్తి జీవిత‌కాలం క‌ష్ట‌ప‌డినా అంత రాదు!!

అదానీ నిమిషానికి ఎంత సంపాదిస్తాడో తెలుసా? స‌గ‌టు వ్య‌క్తి జీవిత‌కాలం క‌ష్ట‌ప‌డినా అంత రాదు!!

billionaires income per hour | gautam adani | mukesh ambani
billionaires income

billionaires income per hour | మీ సంపాద‌న‌ ఎంత? నెల‌కు 20 నుంచి 30 వేల వ‌ర‌కు ఉంటుందా? సాఫ్ట్‌వేర్ జాబ్ లేదా మేనేజ‌ర్ స్థాయి అయితే ఇంకొంచెం ఎక్కువ ఉండొచ్చు.. అంతేక‌దా..! మ‌రి మ‌న దేశంలోనే.. కాదు.. కాదు.. ఆసియాలోనే అత్యంత ధ‌న‌వంతులైన ముఖేశ్‌ అంబానీ, గౌత‌మ్‌ అదానీల‌ సంపాద‌న ఎంత ఉంటుందో ఎప్పుడైనా ఆలోచించారా? వాళ్లు గంట‌కు ఎంత సంపాదిస్తారో తెలుసా? అదానీ నిమిషంలో సంపాదించే డ‌బ్బును.. మ‌న దేశంలో స‌గ‌టు మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ్య‌క్తి జీవిత కాలం క‌ష్ట‌ప‌డినా సంపాదించ‌లేడు. ఒకరు.. ఇద్ద‌రు కాదు.. 10 మంది కలిసి జీవిత కాలం సంపాదించినప్ప‌టికీ.. అదానీ గంట ఆదాయానికి స‌రిపోదు. అంటే అర్థం చేసుకోండి.. వాళ్ల సంపాద‌న ఏ రేంజ్‌లో ఉండి ఉంటుందో.. ! అదానీనే కాదు.. అంబానీ, మిట్ట‌ల్‌, ధ‌మానీ ఇలా చాలా మంది గంట‌కు కోట్ల రూపాయ‌లు ఆర్జిస్తున్నారు. మ‌రి మ‌న దేశంలో ఉన్న సంప‌న్నులు గంట‌కు ఎంత సంపాదిస్తున్నారో చూద్దాం..

billionaires income per hour | gautam adani | mukesh ambani
Gautam adani income

గౌత‌మ్ అదానీ

క‌రోనా స‌మ‌యంలో లాక్‌డౌన్ కార‌ణంగా ఎంతోమంది న‌ష్ట‌పోయారు. కానీ అలాంటి ప్యాండిమిక్ సిట్యుయేష‌న్‌లోనూ గౌత‌మ్ అదానీ లాభాల్లో దూసుకెళ్లారు. క‌రోనా స‌మ‌యంలో ఆయ‌న కుటుంబ ఆస్తి 261 శాతం పెరిగింది. 2020 హురున్ లిస్టులో అదానీ సంప‌ద ( Gautam adani income ) 1.4 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఉండ‌గా.. ప్ర‌స్తుతం 5.05 ల‌క్ష‌ల కోట్లకు పెరిగింది. ఈ లెక్క‌న చూస్తే గౌత‌మ్ అదానీ ఆదాయం రోజుకు 1,002 కోట్లు సంపాదించాడు. అంటే గంట‌కు ఆదానీ ఆదాయం రూ.42 కోట్లు అన్న‌మాట !! ఇక గౌత‌మ్ అదానీ త‌మ్ముడైన వినోద్ శాంతీలాల్ అదానీ సంప‌ద ప్ర‌తి గంట‌కు రూ.10.2 కోట్లు పెరుగుతూ వ‌స్తుంది.

billionaires income per hour | lakshmi mittal

ల‌క్ష్మీ మిట్ట‌ల్

- Advertisement -

ప్ర‌పంచంలోనే అతి పెద్ద స్టీల్ ఉత్ప‌త్తి కంపెనీ ఆర్సెల‌ర్‌ అధినేత ల‌క్ష్మీ నివాస్ మిట్ట‌ల్ సంప‌ద కూడా క‌రోనా టైంలో బాగానే పెరిగింది. ఉక్కుకు గిరాకీ పెర‌గ‌డంతో ఆయ‌న కంపెనీ షేర్లు మూడింతలు అయ్యాయి. గ‌త ఏడాదిలో మిట్ట‌ల్ సంప‌ద 187 శాతం పెరిగి రూ.1.74 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. ఈ లెక్క‌న ప్ర‌తి గంట‌కు ఆయ‌న రూ.13 కోట్లు సంపాదిస్తున్న‌ట్టే !

billionaires income per hour | shiv nadar
shiv nadar

శివ‌నాడార్

హెచ్‌సీఎల్ టెక్నాల‌జీస్ లిమిటెడ్ అధినేత శివ‌నాడార్ కుటుంబం మొత్తం ఆస్తుల విలువ రూ.2.36 ల‌క్ష‌ల కోట్ల‌కు పైగానే ఉంటుంది. గ‌త ఏడాది కాలంగా ఈయ‌న ఆస్తి రోజుకు 260 కోట్లు పెరుగుతూ వ‌స్తుంది. అంటే శివ‌నాడార్‌ గంట‌కు రూ.11 కోట్లు సంపాదిస్తున్నాడు.

billionaires income per hour | s. p. hinduja
s. p. hinduja

ఎస్పీ హిందుజా

గ‌త ఏడాదితో పోలిస్తే హిందూజా గ్రూప్‌లోని అశోక్ లేల్యాండ్ షేర్లు 74 శాతం , ఇండ‌స్ఇండ్ బ్యాంకు షేర్లు 61 శాతం పెరిగాయి. దీంతో హిందుజా అధినేత శ్రీచంద్ పి. హిందూజా సంప‌ద రూ.2.20 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరింది. అంటే ఎస్పీ హిందూజా ఆదాయం రోజుకు రూ.209 కోట్లు.. గంట‌కు సుమారు 9 కోట్లు.

billionaires income per hour | Cyrus S. Poonawalla
Cyrus S. Poonawalla

సైరస్‌ పూనావాలా

క‌రోనావైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారు చేసిన సీర‌మ్ ఇన్‌స్టిట్యూట్ అధినేత సైర‌స్ ఎస్ పూనావాలా సంప‌ద‌ ప్ర‌తి గంట‌కు దాదాపు రూ.8కోట్లు పెరుగుతోంది. ప్ర‌స్తుతం ఆయ‌న సంప‌ద రూ.1.63 ల‌క్ష‌ల కోట్లు.

billionaires income per hour | Radhakishan Damani
Radhakishan Damani

డీ మార్ట్ అధినేత ద‌మానీ

డీ మార్ట్‌లో త‌క్కువ ధ‌ర‌ల‌కే స‌రుకులు ల‌భిస్తుండ‌టంతో న‌గ‌రాల‌తో పాటు చిన్న ప‌ట్ట‌ణాల్లోనూ వీటికి ఆద‌ర‌ణ బాగా పెరిగింది. దీంతో డీమార్ట్ కంపెనీ షేర్లు ఒక్క‌సారిగా 500 శాతం పెరిగాయి. దీంతో డీమార్ట్ అధినేత రాధాకిష‌న్ ద‌మానీ సంప‌ద‌లో ప్ర‌తి గంట‌కు రూ.7.66 కోట్లు వ‌చ్చి చేరాయి. ప్ర‌స్తుతం ఆయ‌న మొత్తం సంప‌ద విలువ రూ.1.54 ల‌క్ష‌ల కోట్లు.

billionaires income per hour | gautam adani | mukesh ambani

ముఖేశ్ అంబానీ

మన దేశంలోనే కాదు ఆసియాలోనే అత్యంత సంపన్నుడు రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత‌ ముఖేశ్ అంబానీ. వీళ్ల ఆస్తుల విలువ దాదాపు ఒక దేశ బడ్జెట్‌కు మించే ఉంటుంది. ముఖేశ్ అంబానీ కుటుంబ ఆస్తుల విలువ దాదాపు ఏడు ల‌క్ష‌ల ప‌ద్దెనిమిది వేల కోట్ల రూపాయ‌లు. ఇక ఈయ‌న సంపాద‌న రోజుకు ఎంతో తెలుసా ! రూ.6.8కోట్ల‌కు పైగానే ఉంటుంది. అంటే ముఖేశ్ అంబానీ ఆస్తి రోజుకు రూ.163 కోట్లు పెరుగుతూ వ‌స్తుంద‌న్న‌మాటే.

కుమార మంగ‌ళం బిర్లా గంట‌కు రూ.10 కోట్లు సంపాదిస్తున్నారు. స్కేల‌ర్ కంపెనీ అధినేత జ‌య్‌చౌద‌రి రూ.6.37 కోట్లు ఆర్జిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చదవండి..

బిల్ గేట్స్‌, వారెన్ బ‌ఫెట్‌, ర‌త‌న్ టాటా.. అప‌ర కుబేరులు చేసిన ఫ‌స్ట్ జాబ్ ఏంటో తెలుసా?

వ్య‌వ‌సాయం చేస్తున్న డాక్ట‌ర్‌.. గ‌వ‌ర్న‌ర్ ఇంటికి కూడా ఈయ‌న పండించిన బియ్య‌మే వెళ్తాయి

ప్రేమ కోసం రాజ‌రికాన్ని, రాజ‌భోగాల‌ను వ‌దిలేసిన యువ‌రాజులు, యువ‌రాణులు వీళ్లే..

Tavolara | ఆ రాజ్యంలో ఉండేది కేవ‌లం 11 మందే.. మ‌రి రాజుగారి పనేంటో తెలుసా !

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement