AP Inter Results | ఏపీ ఇంటర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ ఫలితాలను రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. ఫలితాల కోసం ఇంటర్ బోర్డు అధికారిక వెబ్సైట్ https://resultsbie.ap.gov.in/ ను సంప్రదించాలని సూచించారు.
ఇంటర్ ఫస్టియర్లో 5,10,307 మంది, సెకండియర్లో 5,05,609 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వీరిలో ప్రథమ సంవత్సరంలో 77 శాతం, ద్వితీయ సంవత్సరంలో 81 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. గత 12 సంవత్సరాల్లో ఎన్నడూలేని విధంగా అత్యధిక ఉత్తీర్ణత శాతాన్ని సాధించారని నారా లోకేశ్ హర్షం వ్యక్తం చేశారు.
కాగా, ఏపీ ఇంటర్ ఫలితాల్లో కృష్ణా జిల్లాలో అత్యధికంగా ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ జిల్లాలో 92 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఆ తర్వాత గుంటూరులో 88 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 87 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక అన్నమయ్య జిల్లాలో అత్యల్ప ఉత్తీర్ణత శాతం నమోదైంది. ఈ జిల్లాలో కేవలం 62 శాతం మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు.
ఏపీ ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు మే 21వ తేదీన ప్రారంభం కానున్నాయి. జూన్ 4వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి. ఫెయిల్ అయిన విద్యార్థులకు ఇంటర్ ప్రాక్టికల్స్ జూన్ 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరుగుతాయి.