Vaazha | ఈసారి అమ్మాయిల బయోపిక్.. ‘వాళ 3’ ఫస్ట్ లుక్ విడుదల
Vaazha | మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచిన 'వాళ' (Vaazha) సిరీస్ నుంచి మూడవ భాగం సిద్ధమవుతోంది.
Vaazha | మలయాళ చిత్ర పరిశ్రమలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీలలో ఒకటిగా నిలిచిన ‘వాళ’ (Vaazha) సిరీస్ నుంచి మూడవ భాగం సిద్ధమవుతోంది. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ప్రముఖ దర్శకుడు విపిన్ దాస్ తాజాగా విడుదల చేశారు. ‘బయోపిక్ ఆఫ్ బిలియన్ గర్ల్స్’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. గత రెండు భాగాల్లో అబ్బాయిల కథలను చూపించిన మేకర్స్, ఈ మూడవ భాగంలో పూర్తిగా మహిళా ప్రధాన తారాగణంతో సినిమాను రూపొందించడం విశేషం. విపిన్ దాస్ కథను అందించిన ఈ చిత్రానికి డెబ్యూటెంట్ విశ్వన్ శ్రీజిత్ దర్శకత్వం వహించబోతున్నాడు.
కొత్త ప్రతిభను వెండితెరకు పరిచయం చేయాలనే ఉద్దేశంతోనే ఈ ఫ్రాంచైజీని ప్రారంభించామని, ఆ వారసత్వాన్ని ‘వాళ 3’తోనూ కొనసాగిస్తామని విపిన్ దాస్ సోషల్ మీడియా వేదికగా తెలిపారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానుంది. 2024లో విడుదలైన ‘వాళ: బయోపిక్ ఆఫ్ బిలియన్ బాయ్స్’ ఘనవిజయం సాధించగా, 2026లో వచ్చిన ‘వాళ 2: బయోపిక్ ఆఫ్ బిలియన్ బ్రోస్’ కూడా ప్రస్తుతం థియేటర్లలో సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు రాబోతున్న మూడవ భాగం యువతకు, ముఖ్యంగా మహిళా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని ఇస్తుందని చిత్ర బృందం ఆశాభావం వ్యక్తం చేస్తోంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
Power Cuts | కాంగ్రెస్ మీటింగ్‌కు కరెంట్ షాక్.. మంత్రి పొంగులేటి మాట్లాడుతుండగా పవర్ కట్
Gajwel | నువ్వింకా చావలేదా?.. పురుగుమందు తాగలేదా?.. రైతును అవహేళన చేసిన తహసీల్దార్
Bullet Train | బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనలకు ముందే భూసేకరణ షురూ.. కేంద్రం స్పష్టతతో బట్టబయలైన రేవంత్‌రెడ్డి బాగోతం
Bigg Boss 10 | బిగ్‌బాస్‌లో షాలినికి నాగార్జున గట్టి క్లాస్.. రోహిత్‌కు ‘మేలుకో రాజా’ అంటూ పంచ్!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

