Power Crisis | ప్రపంచానికి కరెంటు కష్టాలు.. ఇక పాలు కూడా పితకలేరేమో..
Power Crisis | విద్యుత్ కొరతతో మున్ముందు పాలు కూడా పితకడం ఇబ్బందిగా మారుతుందా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

Power Crisis | యూరప్ దేశాలు సహా ప్రపంచ దేశాల్లో ఇప్పటికే విద్యుత్ సంక్షోభం కొనసాగుతున్నది. తత్ఫలితంగా మున్ముందు పాలు పితకడానికి కూడా ఇబ్బందులు ఎదురవుతాయా? అన్న సందేహాలు వస్తున్నాయి.. గోవులు.. గేదెల నుంచి పాలు పితికే యంత్రాలు మొదలు.. బొమ్మల తయారీ వరకు ప్రపంచవ్యాప్తంగా సప్లయ్ చైన్‌పై భారీ స్థాయిలో ప్రభావం పడుతుందని చైనా భావిస్తోంది. బొగ్గు, విద్యుత్ కొరతతో చైనాలోని కొన్ని రాష్ట్రాలు.. విద్యుత్ వినియోగాన్ని తగ్గించడానికి తమ ఫ్యాక్టరీలను మూసేశాయి. విద్యుత్ కొరత వల్ల పంటల నూర్పిడికి సవాళ్లు ఎదురవుతాయని డ్రాగన్ ఆందోళన చెందుతున్నట్లు సమాచారం.
చైనాలో గ్యాడ్జెట్స్ .. ఆటోమొబైల్ వరకు ఇలా..
గృహోపకరణాలు, ఆటోమొబైల్స్‌లో వాడే ప్యాకేజింగ్ సెమీ కండక్టర్లు, గాడ్జెట్స్ ప్రొడక్ట్ బేస్‌గా చైనా ఉంది. ఇప్పటికే ఆటోమొబైల్ రంగాన్ని సెమీ కండక్టర్ల కొరత దెబ్బ తీస్తున్నది. తాజాగా చైనాలో విద్యుత్ కొరత వల్ల టయోటా కార్ల తయారీ సంస్థలో కార్ల ఉత్పత్తి కొంత తగ్గే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆకాశాన్నంటే రీతిలో నాచురల్ గ్యాస్ ధరలు
మరోవైపు యూరప్‌లో సహజవాయువు ధరలు ఆకాశాన్నంటే రీతిలో దూసుకెళ్తున్నాయి. సహజవాయువు ధరల పెరుగుదలతో యూరప్ దేశాల్లోని రసాయన ఎరువుల తయారీ సంస్థలు ఉత్పత్తి తగ్గించుకుంటున్నాయి. ఈ పరిణామం అంతర్జాతీయంగా ఆహార ద్రవ్యోల్బణం పెరిగే సంకేతాలు కనిపిస్తున్నాయి.
గ్యాస్ దిగుమతి కోసం ఆసియా దేశాల ఇబ్బందులు ఇలా..
లిక్విఫైడ్ నాచురల్ గ్యాస్ దిగుమతి కోసం ఆసియాదేశాలు రికార్డు స్థాయిలో డబ్బు చెల్లించాల్సి వస్తోంది. పాకిస్థాన్‌లో ఇది రాజకీయ టెన్షన్లకు దారి తీసింది. ప్రభుత్వ యాజమాన్యం ఆధ్వర్యంలో లిక్విఫైడ్ గ్యాస్ కొనుగోళ్లపై విచారణ చేపట్టాలని పాక్ విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు.
యూరప్.. ఆసియా ఖండాల్లో పరిస్థితులు ఇవీ
యూరప్‌లో నాచురల్ గ్యాస్ కొరత వెంటాడుతుండగా, ఆసియా దేశాల నుంచి బొగ్గు సరఫరా పరిమితంగా సాగుతోంది. గతేడాదితో పోలిస్తే యూరప్ దేశాల్లో సహజవాయువు ధరలు 500 రెట్లకు పైగా పెరిగిపోయాయి. సెప్టెంబర్ నుంచి 130 శాతం ఎక్కువ ధరకు సహజ వాయువు కొనాల్సిన దుస్థితి నెలకొంది. అమెరికాలో సైతం గత 13 ఏండ్లలో తొలిసారి నాచురల్ గ్యాస్ ధరలు ఎక్కువగా ఉన్నాయి.
బొగ్గు సరఫరా కోసం యూరప్ ఆశలు..
సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి నెమ్మదించింది. బొగ్గు సప్లయ్ కోసం యూరప్ దేశాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. డిమాండ్‌కు అనుగుణంగా చైనా, ఇండోనేషియా బొగ్గు సరఫరా చేయలేక చతికిల పడుతున్నాయి. ఆస్ట్రేలియా న్యూ క్యాస్టిల్ థర్మల్ కోల్ మెట్రిక్ టన్ను ధర 202 డాలర్లు. 2019 చివరిలో ధరతో పోలిస్తే మూడు రెట్లు ఇది ఎక్కువ. ఇక లెబనాన్‌లో బొగ్గు కొరతతో దేశంలోని రెండు అతిపెద్ద పవర్ స్టేషన్లు మూత పడ్డాయి. శనివారం లెబనాన్ పవర్ నెట్వర్క్ పూర్తిగా నిలిపేస్తున్నారు. వచ్చే కొన్ని రోజులు అవి మూతపడి ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
- Tags
- Asia
- Europe
- Power crisis
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Roller | పాలపిట్టను విడుదల చేసిన ఘటనపై కేసు నమోదు
World Cup | ఇండియాలో వరల్డ్ కప్ టోర్నీకి పాకిస్తాన్ దూరం.. జట్టు పర్యటనకు అనుతివ్వని పీసీబీ
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Muskan Rastogi | బ్లూ డ్రమ్ మర్డర్ కేసు.. జైలులోనే నిందితురాలు, 10 నెలల కూతురు.. చిన్నారి దత్తత కోరుతూ పిటిషన్
ట్రెండింగ్ వార్తలు
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!

