శనివారం 15 ఆగస్టు 2020
Business - Jul 12, 2020 , 01:00:15

పొడిగించాల్సిన అవసరం లేదు

పొడిగించాల్సిన అవసరం లేదు

  • మారటోరియంపై ఎస్బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌

ముంబై, జూలై 11: మారటోరియాన్ని డిసెంబర్‌ వరకు పొడిగించాల్సిన అవసరం లేదని బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్బీఐ చైర్మన్‌ రజనీశ్‌ కుమార్‌ అభిప్రాయపడ్డారు. అవసరాన్ని బట్టి కొన్ని రంగాలకు మాత్రమే దీన్ని పరిమితం చేసే అవకాశాన్ని పరిశీలించొచ్చని బ్యాంక్‌ ఏర్పాటు చేసిన   7వ బ్యాంకింగ్‌, ఎకనామిక్స్‌ కన్‌క్లేవ్‌లో ఆయన వ్యాఖ్యానించారు. కరోనా సంక్షోభంతో పేరుకుపోతున్న మొండి బకాయిల పట్ల ఎస్బీఐ అనవసర ఆందోళన చెందటం లేదని కూడా ఆయన తెలిపారు. జూన్‌ నెల నుంచి ఆర్థిక వ్యవస్థ కోలుకుంటున్నదన్న ఆయన..కేవలం కొన్ని రంగాలే ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయని ఆయన పేర్కొన్నారు. 

ఆర్బీఐ తొలిసారి ప్రకటించిన మూడు నెలల మారటోరియం  మే 31న ముగియగా..దీనిని ఆగస్టు 31 వరకు పొడిగించిన విషయం తెలిసిందే. మే నాటికి బ్యాంక్‌ ఖాతాదారుల్లో 20 శాతం మంది మారటోరియాన్ని ఎంచుకున్నప్పటికీ, గత నెల చివరినాటికి ఈ సంఖ్య మరింత తగ్గిందన్నారు. ఇప్పటికే మారటోరియాన్ని రెండు సార్లు పెంచిన సెంట్రల్‌ బ్యాంక్‌..మరోదఫా ఈ ఏడాది చివరినాటికి పెంచబోతున్నట్లు పలు మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించారు.  


logo