Nitin Gadkari | లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై ( life and medical insurance plans) చెల్లించే జీఎస్టీ (GST)ని తొలగించాలని కేంద్ర ఆర్థిక శాఖను కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ (Nitin Gadkari) కోరారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman)కు లేఖ రాశారు. నాగ్పూర్ డివిజనల్ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఎంప్లాయీస్ యూనియన్ నుంచి వచ్చిన మెమోరాండం ప్రకారం లేఖ రాస్తున్నట్లు గడ్కరీ తెలిపారు.
కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి, ప్రమాదాల సమయంలో వ్యక్తికి సహాయంగా నిలిచే ప్రీమియంలపై పన్నును యూనియన్ వ్యతిరేకిస్తోందని గడ్కరీ తన లేఖలో పేర్కొన్నారు. ఈ ప్రీమియంలపై 18% జీఎస్టీ అనేది సమంజసం కాదన్నారు. ఇదొక సామాజిక అవసరం అని.. కాబట్టి జీవిత, వైద్య బీమా పథకాల ప్రీమియంలపై పన్ను ఉపసంహరించుకోవాలని కోరారు.
‘యూనియన్ లేవనెత్తిన ప్రధాన సమస్య లైఫ్, హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలపై జీఎస్టీ ఉపసంహరణకు సంబంధించినది. ఈ రెండింటిపై 18 శాతం పన్ను ఉంది. జీవిత బీమా ప్రీమియంపై జిఎస్టీ విధించడం అనేది అనిశ్చితిపై పన్ను విధించడం కిందకే వస్తుంది. కుటుంబానికి కొంత రక్షణ కల్పించడానికి తీసుకునే జీవిత బీమాపై పన్ను విధించకూడదని యూనియన్ భావిస్తోంది. అదేవిధంగా, వైద్య బీమా ప్రీమియంపై 18 శాతం జీఎస్టీ అనేది సమంజసం కాదు. సామాజికంగా అవసరమైన ఈ విభాగం వ్యాపార వృద్ధికి అడ్డంకిగా మారుతోంది. అందుకే వీటిపై జీఎస్టీని ఉపసంహరించుకోవాలని యూనియన్ కోరుతోంది’ అని నితిన్ గడ్కరీ తన లేఖలో వివరించారు.
Also Read..
Kerala | కేరళకు భారీ నుంచి అతి భారీ వర్ష సూచన.. పలు జిల్లాలకు అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
coaching centres | కోచింగ్ సెంటర్ల నియంత్రణకు చట్టం : ఢిల్లీ మంత్రి అతిషీ