Nita Ambani | రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ.. ఆసియాలోనే అత్యంత ధనవంతుడు. ఆ సంపన్నుడి సతీమణి నీతా అంబానీ (Nita Ambani) ఆ రేంజ్‌కు తగ్గట్లే ఉంటుంది. ఎక్కడా ఆమె వైభవం తగ్గదు. రిచ్‌నెస్‌కు కేరాఫ్ అడ్రెస్ ఆమె. ఈవెంట్లకు తగ్గట్టు కట్టూబొట్టుతో ఆకట్టుకుంటుంటుంది. బాలీవుడ్ సినీ సెలబ్రిటీలకు తీసిపోని రీతిలో ఫ్యాషన్‌ను ప్రదర్శిస్తుంటారు. పూజా, వివాహాది కార్యక్రమాలకు సంప్రదాయ చీరకట్టులో దర్శనమిచ్చే నీతా.. బిజినెస్ ఈవెంట్లలో అందుకు తగ్గట్టు దుస్తులను ధరిస్తుంటారు. ఇంకా చెప్పాలంటే ఎక్కువశాతం నీతా భారతీయ సంప్రదాయం ఉట్టిపడేలా తనకు ఎంతో ఇష్టమైన చీర కట్టునే (traditional sarees) ఎంచుకుంటారు.
తాజాగా మొన్న జరిగిన అమెరికా అధ్యక్షుడి ప్రమాణస్వీకారోత్సవ కార్యక్రమంలో (Trumps inauguration) కూడా నీతా భారతీయ సంప్రదాయమైన చీరకట్టునే ఎంచుకుని మరోసారి తన ఫ్యాషన్ సెన్స్‌ను ప్రదర్శించారు. ట్రంప్ ఇనాగరేషన్‌కు ముందు జరిగిన ప్రైవేట్ రిసెప్షన్లో కాంచీపురం సిల్క్ శారీ ధరించి ఆకట్టుకున్నారు. పింక్, గ్రీన్ బోర్డర్‌తో కూడిన నలుపు రంగు పట్టుచీరలో మెరిసిపోయారు. ఈ చీరను తమిళనాడులోని దేవాలయాల శిల్ప కళను ప్రతిబింబించేలా తీర్చిదిద్దారు. ఈ శారీకి ప్రముఖ డిజైనర్ మనీశ్ మల్హోత్ర డిజైన్ చేసిన మోడ్రన్ బ్లౌజ్‌ను ధరించారు. ఇక చీరతోపాటు ఆమె ధరించిన పచ్చల హారం మరింత ఆకర్షణీయంగా కనిపించింది. ఈ నగలకు సుమారు 200 ఏళ్ల నాటి చరిత్ర ఉందట. ప్యారెట్ షేప్‌లో ఉన్న పెండెంట్‌ను ఈ హారానికి జత చేశారు.
ఇక ట్రంప్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఏర్పాటు చేసిన ప్రత్యేక విందులో కూడా నీతా డిజైనర్ శారీలో మెరిసిపోయారు. ఏస్ డిజైనర్ తరుణ్ తహిలియాని డిజైన్ చేసిన కశ్మీరీ ఫ్యాబ్రిక్ చీరను ధరించి ఎంతో అందంగా కనిపించారు. ఈ చీరను దాదాపు 1,900 గంటలపాటు శ్రమించి రూపొందించిందిగా తెలిసింది. ఈ చీరకు తగ్గట్టు నీతా ధరించిన బ్లౌజ్ మరింత ఆకర్షణీయంగా ఉంది. మోడ్రన్ టేపర్డ్ కాలర్డ్ బ్లౌజ్‌కు నెక్లైన్ వద్ద చంకీ డైమండ్ బ్రూచ్తో ఎంతో అందంగా తీర్చిదిద్దారు. చీర కంటే ఈ బ్లౌజే చాలా హైలెట్‌గా ఉంది. ఇక చీరకు తగ్గట్టుగానే చెవిపోగులు, రింగ్, బ్యాంగిల్ ధరించింది నీతా. సింపుల్ హెయిర్‌స్టైల్, మేకప్‌తో 60 ఏళ్ల నీతా.. చాలా యంగ్‌గా కనిపించారు. నీతా లుక్ ఈవెంట్‌కు హాజరైన ప్రతి ఒక్కరినీ ఎంతగానో ఆకర్షించింది. ట్రంప్ ఈవెంట్లో నీతా అంబానీ హైలెట్‌గా నిలిచారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఆ ఫొటోలను చూసిన నెటిజన్లు నీతా ఫ్యాషన్ సెన్స్ గురించే మాట్లాడుకుంటున్నారు.
#TrumpInauguration2025 | #MukeshAmbani & #NitaAmbani attended the Private Reception in Washington ahead of #DonaldTrump‘s inauguration
Their presence celebrated India’s enduring heritage, strong international ties, and growing commitment to fostering shared progress and… pic.twitter.com/8JLSve0Q4g
— CNBC-TV18 (@CNBCTV18News) January 20, 2025
Also Read..
Cracked Lips | పెదవులు బాగా పగులుతున్నాయా.. అయితే ఈ చిట్కాలను పాటించండి..!
Donald Trump: చైనా దిగుమతులపై 10 శాతం పన్ను విధించనున్న అమెరికా