Cracked Lips | సాధారణంగా చాలా మందికి చలికాలంలో పెదవులు పగులుతుంటాయి. అయితే కొందరికి ఈ సమస్య ఎల్లప్పుడూ ఉంటుంది. పెదవులు పగిలి అంద విహీనంగా కనిపిస్తుంటాయి. దీంతో నలుగురిలోనూ తిరగలేకపోతుంటారు. పెదవులు పగలడం అన్నది సహజంగానే జరిగే ప్రక్రియ అయినప్పటికీ కొందరికి ఈ సమస్య మరింత ఎక్కువగా ఉంటుంది. పెదవులు మంటగా అనిపిస్తాయి. కొందరికి రక్తం కూడా వస్తుంటుంది. అయితే ఇందుకు ఖరీదైన చికిత్స తీసుకోవాల్సిన పనిలేదు. ఎలాంటి మెడిసిన్లను వాడాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉండే పలు సహజసిద్ధమైన పదార్థాలను వాడితే చాలు, పెదవులు పగలడం తగ్గుతుంది. పెదవులు అందంగా మారుతాయి. ఇక అందుకు ఏం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పగిలిన పెదవులను అందంగా మార్చేందుకు కొబ్బరినూనె ఎంతగానో పనిచేస్తుంది. కొబ్బరినూనెను రాత్రి పూట పెదవులకు రాయాలి. మరుసటి రోజు ఉదయం గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా రోజూ చేస్తుంటే పెదవులు పగలడం తగ్గుతుంది. కొబ్బరినూనెలో మాయిశ్చరైజింగ్ గుణాలు ఉంటాయి. ఈ నూనెలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు పగిలిన పెదవులకు మరమ్మత్తులు చేస్తాయి. దీంతో పొడిబారడం కూడా తగ్గుతుంది. పెదవులు అందంగా మారి కాంతివంతంగా ఉంటాయి. అలాగే పగిలిన పెదవుల సమస్య నుంచి బయట పడేందుకు తేనె కూడా అద్భుతంగా పనిచేస్తుంది. తేనెలో సహజసిద్ధమైన హీలింగ్ గుణాలు ఉంటాయి. అందువల్ల పెదవులకు తేమ లభిస్తుంది. చర్మానికి మరమ్మత్తులు చేస్తుంది. తేనెనుపెదవులకు రాసి కొన్ని నిమిషాలు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజుకు 3 సార్లు చేస్తుంటే పగిలిన పెదవులు మళ్లీ సాధారణ స్థితికి వస్తాయి. పెదవులుగా తేమగా ఉండి అందంగా కనిపిస్తాయి.
కలబంద గుజ్జును కూడా పగిలిన పెదవలుపై రాస్తుండవచ్చు. దీంతో పెదవులకు కావల్సిన తేమ లభిస్తుంది. కలబంద గుజ్జు పెదవులకు తేమను, చల్లదనాన్ని అందిస్తుంది. కలబందలో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ, యాంటీ మైక్రోబియల్ గుణాలు పగిలిన పెదవులను తిరిగి సాధారణ స్థితికి తీసుకువస్తాయి. రోజూ పెదవులకు కలబంద గుజ్జును రాస్తుంటే ఫలితం ఉంటుంది. అలాగే పెదవులకు నెయ్యిని కూడా రాయవచ్చు. ఇది చర్మానికి తేమను, కాంతిని అందిస్తుంది. కొద్దిగా నెయ్యి తీసుకుని పెదవులకు రాసి కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా రోజుకు 2 సార్లు చేస్తుండాలి. దీంతో పగిలిన పెదవులు తిరిగి పూర్వ స్థితికి వస్తాయి. పెదవులను సంరక్షించడంలో నెయ్యి అద్భుతంగా పని చేస్తుంది. ఇది చర్మానికి మరమ్మత్తులు చేస్తుంది.
మీ పెదవులు పగిలిపోయి బాగా ఇబ్బంది పెడుతుంటే కీరదోసను కూడా ఉపయోగించవచ్చు. కీరదోస ముక్కలను పెదవులను సున్నితంగా మసాజ్ చేస్తుండాలి. కనీసం 5 నిమిషాల పాటు ఇలా చేయాలి. ఇలా రోజుకు కనీసం 3 సార్లు చేస్తుండాలి. దీంతో పెదవులు పగలడం తగ్గుతుంది. పెదవులకు తేమ లభిస్తుంది. అవి మృదువుగా కాంతివంతంగా మారుతాయి. కీరదోసలో నీటి శాతం ఎక్కువ కనుక పెదవులకు తేమ లభించి అందంగా మారుతాయి. అలాగే గులాబీ పువ్వులను పేస్ట్‌లా చేసి దాన్ని పెదవులకు రాస్తుండాలి. కాసేపు అయ్యాక కడిగేయాలి. ఇలా చేస్తుంటే పెదవులు పగలడం తగ్గుతుంది. పెదవులు అందంగా పింక్ రంగులోకి మారుతాయి.కాంతివంతంగా కనిపిస్తాయి. ఇలా పలు ఇంటి చిట్కాలను పాటిస్తే పెదవులు పగలడాన్ని తగ్గించుకోవచ్చు. పెదవులు అందంగా కూడా కనిపిస్తాయి.