Nissan X-Trail | ప్రముఖ కార్ల తయారీ సంస్థ నిసాన్ ఇండియా త్వరలో భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్న ఎక్స్-ట్రయల్ కారును గురువారం ఆవిష్కరించింది. గత కొన్నేండ్లలో భారత్ లో నిసాన్ ఆవిష్కరించిన తొలి కారు ఇది. దాదాపు దశాబ్ద కాలం తర్వాత భారత్ మార్కెట్లోకి నిసాన్ తన ఫోర్త్ జనరేషన్ ఎక్స్ ట్రయల్ కారును తీసుకొస్తున్నది.
నిసాన్ ఎక్స్ ట్రయల్ కారు చంకీ వీ మోషన్ గ్రిల్లె అప్ ఫ్రంట్తోపాటు స్ప్లిట్ హెడ్ ల్యాంప్ సెటప్, రేర్‌లో ఎల్ఈడీ టెయిల్ లైట్స్ ఉంటాయి. కారు సైజుకు అనుగుణంగా 20-అంగుళాల అల్లాయ్ వీల్స్ ఉంటాయి. వైర్ లెస్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతోపాటు 8-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డ్యుయల్ జోన్ ఏసీ, పనోరమిక్ సన్ రూఫ్, పడల్ షిఫ్ట్స్, స్లైడింగ్ అండ్ రీసైక్లింగ్ సెకండ్ రో సీట్లు, సేఫ్టీ కోసం 7 ఎయిర్ బ్యాగ్స్, లిమిలెడ్ స్లిప్ డిఫరెన్షియల్, ఫ్రంట్ అండ్ రేర్ పార్కింగ్ సెన్సర్లు విత్ 360 వ్యూ డిగ్రీ కెమెరా ఉంటాయి.
గ్లోబల్ మార్కెట్లో ఆవిష్కరించిన నిసాన్ ఎక్స్-ట్రయల్ లో మాదిరిగా భారత్ మార్కెట్లో హైబ్రీడ్ వర్షన్ విడుదల చేయడం లేదు. 1.5 లీటర్ల టర్బో పెట్రోల్ ఇంజిన్ విత్ 12వీ మైల్డ్ హైబ్రీడ్ టెక్నాలజీతో వస్తున్నది. ఈ ఇంజిన్ గరిష్టంగా 163 హెచ్‌పీ విద్యుత్, 300 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఫ్రంట్ వీల్స్ పై సీవీటీ ట్రాన్స్ మిషన్ ఆప్షన్ ఉంటుంది. 9.6 సెకన్లలోనే గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది. లీటర్ పెట్రోల్ మీద 13.7 కి.మీ మైలేజీ ఇస్తుంది. కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సీబీయూ)గా వస్తున్న మూడు వరుసల ఎస్ యూవీ కారు ధర రూ.40 లక్షలు (ఎక్స్ షోరూమ్) పలుకుతుందని భావిస్తున్నారు. స్కోడా కొడియాక్, జీప్ మెరిడియన్, టయోటా ఫార్చ్యూనర్ కార్లకు పోటీనిస్తుందని తెలుస్తోంది.