Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా సోమవారం పతనమయ్యాయి. 1,475 పాయింట్లు కోల్పోయి 52,847 పాయింట్ల వద్ద సెన్సెక్స్, 427 పాయింట్ల నష్టంతో నిఫ్టీ 15,774 వద్ద ట్రేడింగ్ ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల పవనాలు, అమెరికా ఫెడ్ నిర్ణయాలు, ద్రవ్యోల్బణం, విదేశీ పెట్టుబడుల ఉప సంహరణ నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. బెంచ్‌మార్క్ సూచీలన్నీ దాదాపు 2.5 శాతానికిపైగా పడిపోయాయి.
దీంతో రూ.7లక్షల కోట్లు మదుపరుల సంపద ఆవిరైంది. మరో వైపు రూపాయి విలువ జీవతకాల కనిష్ఠ స్థాయికి పడిపోయి రూ.78.05కి చేరింది. బీఎస్ఈ-30 ఇండెక్స్‌లో కేవలం నెస్లే ఇండియా మాత్రమే 0.5శాతం లాభంతో ముగియగా.. మిగతా అన్నీ నష్టాల్లోనే ముగిశాయి. బజాజ్‌ఫిన్‌సర్వ్, ఇండస్ఇండ్ బ్యాంక్, బజాజ్‌ఫైనాన్స్, టెక్‌మహీంద్ర ఐదుశాతానికిపైగా నష్టపోయాయి. టీసీఎస్, ఐసీఐసీఐ బ్యాంక్ నాలుగు శాతం, ఎన్టీపీసీ, ఎస్బీఐఎన్, ఎల్టీ, ఎంఅండ్ఎం, విప్రోలు మూడు శాతానికపైగా నష్టపోయాయి.