Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం లాభాల్లో ముగిశాయి. దీంతో మూడు రోజుల నష్టానికి తెరపడినట్లయ్యింది. అమ్మకాల ఒత్తిడితో మూడురోజుల పాటు సూచీలు నష్టాల్లో కొనసాగాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 478.59 పాయింట్లు పెరిగి, 57,625.91 వద్ద ముగిసింది. నిఫ్టీ 140 పాయింట్లు పెరిగి, 17,123.60 వద్ద స్థిరపడింది. ఇవాళ్టి ట్రేడింగ్‌లో దాదాపు 1,615 షేర్లు పురోగమించగా.. 1,727 షేర్లు క్షీణించగా.. 133 షేర్లలో ఎలాంటి మార్పులు కనిపించలేదు.
నిఫ్టీలో పవర్ గ్రిడ్ కార్పొరేషన్, యాక్సిస్ బ్యాంక్, కోల్ ఇండియా, బజాజ్ ఆటో, ఎన్టీపీసీ టాప్ గెయినర్స్‌గా.. ఏషియన్ పెయింట్స్, అదానీ ఎంటర్ప్రైజెస్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, భారతీ ఎయిర్టెల్, ఐసీఐసీఐ బ్యాంక్ టాప్ లూజర్స్‌గా నిలిచాయి. అన్ని రకాల సూచీలు గ్రీన్ మార్క్‌లు ముగియగా.. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.6 శాతం, స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.2 శాతం పెరిగాయి.