Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా ఫెడ్ వడ్డీ రేట్లు పెరుగుతాయనే సంకేతాలతో మదుపరులు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం సూచీలు కుప్పకూలాయి. సోమవారం ట్రేడింగ్‌లో సెన్సెక్స్ 872.28 పాయింట్లు పతనమై.. 58,773.87 వద్ద ముగిసింది. నిఫ్టీ 267.75 పాయింట్లు క్షీణించి 17,490.70 ట్రేడింగ్ నిలిచింది. దాదాపు 1228 షేర్లు పురోగమించగా, 2214 షేర్లు క్షీణించాయి. 163 షేర్లు మారలేదు. టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, అదానీ పోర్ట్స్, టాటా మోటార్స్ మరియు జేఎస్‌డబ్ల్యూ స్టీల్ నిఫ్టీ నష్టాల్లో ఉన్నాయి. ఐటీసీ, కోల్ ఇండియా, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, నెస్లే ఇండియా, బ్రిటానియా ఇండస్ట్రీస్ లాభపడ్డాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు ఒక శాతానికి పైగా నష్టపోయాయి.