ముంబై, సెప్టెంబర్ 24 : దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా నాలుగో రోజు భారీగా నష్టపోయాయి. బ్యాంకింగ్, వాహన, క్యాపిటల్ గూడ్స్ రంగ షేర్లలో అమ్మకాలు పోటెత్తడంతోపాటు విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు భారీగా నిధులను ఉపసంహరించుకోవడం సూచీల పతనానికి ఆజ్యంపోశాయి.
30 షేర్ల ఇండెక్స్ సూచీ సెన్సెక్స్ 82 వేల పాయింట్ల దిగువకు పడిపోయింది. ఇంట్రాడేలో 500 పాయింట్ల వరకు నష్టపోయిన సెన్సెక్స్ చివరకు 386.47 పాయింట్లు కోల్పోయి 81,715.63 వద్ద ముగిసింది. మరో సూచీ నిఫ్టీ 112.60 పాయింట్లు కోల్పోయి 25,056.90 వద్ద స్థిరపడింది.