మరో బెంజ్ ఈవీ ప్రారంభ ధర రూ.55 లక్షలు
జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మరో ఈవీ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. సీఎల్ఏ ఎలక్ట్రిక్ పేరుతో పిలిచే ఈ మాడల్ ప్రారంభ ధర రూ.55 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్‌తో ఈ కారు 792 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని పేర్కొన్నది.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 25: జర్మనీకి చెందిన లగ్జరీ కార్ల తయారీ సంస్థ మెర్సిడెజ్ బెంజ్ మరో ఈవీ మాడల్‌ను దేశీయ మార్కెట్‌కు పరిచయం చేసింది. సీఎల్ఏ ఎలక్ట్రిక్ పేరుతో పిలిచే ఈ మాడల్ ప్రారంభ ధర రూ.55 లక్షలుగా నిర్ణయించింది. సింగిల్ చార్జింగ్‌తో ఈ కారు 792 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని పేర్కొన్నది. రెండు రకాల్లో లభించనున్న ఈ ఎలక్ట్రిక్ సెడాన్ దేశవ్యాప్తంగా కంపెనీకి ఉన్న రిటైల్ అవుట్లెట్లలో బుకింగ్‌లు ప్రారంభించింది.
బుకింగ్ చేసుకున్న కస్టమర్‌కు త్వరలో డెలివరీ చేయనున్నట్టు పేర్కొన్నది. సీఎల్ఏ 200 మాడల్ ధర రూ.55 లక్షలుగా నిర్ణయించిన సంస్థ..సీఎల్ఏ 250 + మాడల్ రూ.59 లక్షలు, సీఎల్ఏ 250+ మాడల్ విలువ రూ.64 లక్షలుగా నిర్ణయించింది. 58 కిలోవాట్ల బ్యాటరీ కలిగిన మాడల్ 542 కిలోమీటర్ల మైలేజీ ఇవ్వనుండగా, 85 కిలోవాట్ల బ్యాటరీ మాడల్ 792 కిలోమీటర్లు ప్రయాణించనున్నదని తెలిపింది. కేవలం 20 నిమిషాల్లోనే బ్యాటరీ సగం రీచార్జి కానున్నది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

