Mohammed Siraj | సిరాజ్‌పైనే పేస్ భారం.. బుమ్రా గైర్హాజరీలో బౌలింగ్ దళాన్ని నడిపించనున్న మియాభాయ్
శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సమయం దగ్గరపడుతుండగా.. గాలె, కొలంబోలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు, లంక స్పిన్నర్లతో ఎదురయ్యే సవాల్ గురించే ప్రధాన చర్చ నడుస్తోంది. ఆతిథ్య స్పిన్నర్లకు భారత బ్యాటర్లకు ఎలా కౌంటర్ ఇస్తారు? మన స్పిన్ బౌలర్లు ప్రత్యర్థులను ఎలా కట్టడి చేస్తారు?
(నమస్తే తెలంగాణ క్రీడా విభాగం) శ్రీలంకతో టెస్టు సిరీస్‌కు సమయం దగ్గరపడుతుండగా.. గాలె, కొలంబోలో స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లు, లంక స్పిన్నర్లతో ఎదురయ్యే సవాల్ గురించే ప్రధాన చర్చ నడుస్తోంది. ఆతిథ్య స్పిన్నర్లకు భారత బ్యాటర్లకు ఎలా కౌంటర్ ఇస్తారు? మన స్పిన్ బౌలర్లు ప్రత్యర్థులను ఎలా కట్టడి చేస్తారు? అన్న విశ్లేషణల నడుమ తన పేస్ పవర్‌తో మ్యాచ్ ఫలితాలను మార్చేందుకు 32 ఏండ్ల హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్ నిశ్శబ్దంగా సిద్ధం అవుతున్నాడు. ప్రధాన పేసర్ జస్ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో భారత పేస్ సారథిగా అతను బాధ్యతలు చేపట్టనున్నాడు. శనివారం మొదలయ్యే తొలి టెస్టులో యువ పేసర్లు ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌కు దిశానిర్దేశం చేస్తూనే, పేస్ దళాన్ని ముందుం డి నడిపించే భారాన్ని భుజాలపై వేసుకోనున్నాడు.
బుమ్రా లేకుంటే మరింత డేంజర్
బుమ్రా లేని సమయంలో జట్టు బాధ్యతలను భుజానకెత్తుకోవడం సిరాజ్‌కు కొత్తేమీ కాదు. గతేడాది ఇంగ్లండ్‌తో జరిగిన బర్మింగ్‌హామ్ టెస్టులో వర్క్‌లోడ్ మేనేజ్మెంట్లో భాగంగా బుమ్రా విశ్రాంతి తీసుకోగా.. హైదరాబాదీ తొలి ఇన్నింగ్స్‌లో 70 పరుగులిచ్చి 6 వికెట్లు తీసి మ్యాచ్ స్వరూపాన్నే మార్చేశాడు. ఆ సిరీస్‌లో ఏకంగా 1113 బంతులు విసిరి 23 వికెట్లు పడగొట్టాడు. గాలె, కొలంబోలో ఫ్లాట్, టర్నింగ్ వికెట్లపై సిరాజ్ ఇప్పుడు అన్ని బంతులు వేయాల్సిన అవసరం లేకపోయినా సిరీస్‌లో తన పాత్ర భారత్‌కు కీలకం కానుంది. అయితే, ఇంకో ఎండ్‌లో బుమ్రా లేని టైమ్‌లో ఈ హైదరాబాదీ పేసర్ మరింత పవర్‌ఫుల్‌గా మారుతాడు. తన కెరీర్లో బుమ్రాతో కలిపి ఆడిన 29 టెస్టుల్లో సిరాజ్ 32 సగటుతో 90 వికెట్లు తీశాడు. అదే బుమ్రా లేకుండా పేస్ దళపతిగా బరిలోకి దిగిన 17 టెస్టుల్లో ఏకంగా 25.4 మెరుగైన సగటుతో 50 వికెట్లు పడగొట్టాడు. లీడ్ బౌలర్‌గా ఉన్నప్పుడు సిరాజ్ ఎంత ప్రమాదకరంగా ఉంటాడో చెప్పేందుకు ఈ గణాంకాలే నిదర్శనం.
భారత్‌కు ట్రంప్ కార్డ్
లంకలో తేమతో కూడిన వాతావరణం, ఫ్లాట్ పిచ్‌లపై పేసర్లకు పెద్దగా సహకారం లభించదు. అలాంటి పరిస్థితుల్లోనూ ఒకే తీవ్రతతో బౌలింగ్ చేయడం.. వికెట్ అవసరమైనప్పుడు విభిన్నమైన లైన్ అండ్ లెంగ్త్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను తికమక పెట్టే సిరాజ్ నైజం అతనికి ప్లస్ పాయింట్ కానుంది. బ్యాటర్లను నిస్సహాయులుగా మార్చే తన మార్కు మ్యాజిక్ ఇన్కమింగ్ డెలివరీ, అప్పుడప్పుడు ఇన్సైడ్ ఎడ్జ్‌ను రాబట్టగల సాధారణ ఫుల్ లెంగ్త్ బంతులే ఇక్కడ అతనికి ఆయుధాలు కానున్నాయి. ‘సిరాజ్ ఎప్పుడూ తలవంచడు. ఎలాంటి సవాలునైనా స్వీకరిస్తాడు. రోజులో తొలి బంతి అయినా, ఆఖరి బంతైనా ఒకే తీవ్రతతో బౌలింగ్ చేయడం అతని నైజం. టెన్నిస్ బాల్ క్రికెట్ నేపథ్యం నుంచి రావడం వల్ల సుదీర్ఘంగా బౌలింగ్ చేసే సత్తువ అతనికి ఉంది’ అని హైదరాబాద్‌లో సిరాజ్ చిన్ననాటి మెంటర్ మహ్మూద్ అహ్మద్ చెప్పాడు. బౌలింగ్‌లోనే కాకుండా లోయర్ ఆర్డర్లో బ్యాటర్‌గా నూ సిరాజ్ ఈ సిరీస్‌లో జట్టుకు కీలకం కానున్నాడు. కొలంబోలో శ్రీలంక క్రికెట్ ఎలెవన్‌తో జరిగిన వామప్ మ్యాచ్‌లో 15 బంతుల్లోనే అజేయంగా 32 పరుగులు చేసిన అతను వరుసగా మూడు సిక్సర్లు బాది జట్టుకు ఊహించని విజయాన్ని అందించాడు. తోటి ఆటగాళ్లు మియా భాయ్ అని ముద్దుగా పిలిచే సిరాజ్ ఈ సిరీస్‌లో భారత్‌కు ట్రంప్ కార్డ్‌గా మారే అవకాశం ఉంది.
Read Today's Latest Sports News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

