Mumbai | బీజింగ్‌ను దాటేసిన ముంబై : అత్యధిక బిలియనీర్లతో ఆసియా దేశాల్లో టాప్
Mumbai : దేశ ఆర్ధిక రాజధాని ముంబై అరుదైన ఘనత సాధించింది. అత్యధిక బిలియనర్లతో ముంబై ఆసియన్ క్యాపిటల్‌గా బీజింగ్‌ను అధిగమించింది.
Mumbai : దేశ ఆర్ధిక రాజధాని ముంబై అరుదైన ఘనత సాధించింది. అత్యధిక బిలియనర్లతో ముంబై ఆసియన్ క్యాపిటల్‌గా బీజింగ్‌ను అధిగమించింది. హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ గ్లోబల్ రిచ్ లిస్ట్‌లో ముంబై 92 మంది బిలియనీర్లతో టాప్ ఆసియన్ సిటీగా నిలిచింది. ఇక 119 మంది బిలియనీర్లతో న్యూయార్క్ గ్లోబల్ రిచ్ లిస్ట్ నగరాల జాబితాలో ముందువరసలో నిలవగా 97 మంది బిలియనీర్లతో లండన్ టాప్ 2 పొజిషన్ దక్కించుకుంది.
ఇక దేశ ఆర్ధిక రాజధాని ముంబై ఆసియా ర్యాంకింగ్స్‌లో ఏకంగా బీజింగ్ (91), షాంఘై (87)లను అధిగమించింది. ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుతం 3279 బిలియనీర్లు ఉండగా చైనా నుంచి అత్యధికంగా 814 మంది బిలియనీర్లు ఉన్నారు. ఆపై 800 మంది బిలియనీర్లతో అమెరికా ఈ జాబితాలో రెండో స్ధానంలో ఉంది. ఇక భారత్ 271 మంది బిలియనీర్లతో మూడో స్ధానంలో ఉంది. చైనాలో సంపద సృష్టిలో కీలక మార్పులు చోటుచేసుకుంటున్నాయని, రియల్ ఎస్టేట్, పునరుత్పాదక రంగాలకు చెందిన బిలియనీర్ల సంపద క్షీణిస్తోందని హురున్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ పేర్కొంది.
సంపన్నుల జాబితాలో 84 మంది నూతన సభ్యులు చేరడంలో నూతన సభ్యుల చేరికలో భారత్ రెండో అతిపెద్ద దేశంగా నిలిచింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ ఆసియాలో అత్యంత సంపన్నుడిగా, ప్రపంచంలో అత్యధిక సంపద కలిగిన పదవ వ్యక్తిగా 110 బిలియన్ డాలర్ల సంపదతో తన స్ధానాన్ని నిలబెట్టుకున్నారు. అదానీ గ్రూప్ వ్యవస్ధాపకుడు గౌతం అదానీ 97.9 బిలియన్ డాలర్లతో అంబానీ కంటే మూడు స్ధానాల దిగువన ఉన్నారని బ్లూమ్‌బర్గ్ డేటా వెల్లడించింది. టెస్లా బాస్ ఎలన్ మస్క్ 231 బిలియన్ డాలర్లతో ప్రపంచ కుబేరుల్లో నెంబర్ వన్ స్ధానంలో నిలిచారు.
Read More :
Game Changer | రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ నుంచి ‘జరగండి’ సాంగ్ రిలీజ్
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

