Game Changer | టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ (Ram Charan), తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ (Shankar) కాంబోలో తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్. దిల్ రాజ్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ చివరిదశలో ఉంది. అయితే నేడు రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మేకర్స్ ఈ మూవీ నుంచి క్రేజీ అప్డేట్ను ఇచ్చారు.
ఈ సినిమా నుంచి జరగండి(Jaragandi) లిరికల్ వీడియో సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేశారు. జరగండి జరగండి జరగండి. జాబిలమ్మ జాకెటేసుకొచ్చేనండి అనే లిరిక్స్‌తో ఈ పాట మొదలైంది. మాస్ ట్యూన్స్, క్యాచీ లిరిక్స్‌తో జరగండి పాట అభిమానులను ప్రస్తుతం ఆకట్టుకుంటోంది. ఈ పాటకు ఆనంతశ్రీరామ్ సాహిత్యాన్ని అందించగా.. దలేర్ మెహందీ, సునిధీ చౌహాన్ ఆలపించారు. తమన్ సంగీతం అందించాడు.
ఇక ఈ చిత్రంలో రాజోలు భామ అంజలి, బాలీవుడ్ నటుడు హ్యారీ జోష్, ఎస్జే సూర్య, నవీన్ చంద్ర, శ్రీకాంత్, సముద్రఖని, జయరాయ్, సునీల్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు తెరకెక్కిస్తున్నారు. గేమ్ ఛేంజర్‌కు పాపులర్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు కథనందిస్తుండగా.. సాయిమాధవ్ బుర్రా డైలాగ్స్ అందిస్తున్నారు. తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదల కానుంది.