e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, December 5, 2021
Home News Car prices rise | వాహ‌నాల ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయా.. కార‌ణం అదేనా?!

Car prices rise | వాహ‌నాల ధ‌ర‌లు పెర‌గ‌బోతున్నాయా.. కార‌ణం అదేనా?!

Car prices rise | అస‌లే క‌రోనా మ‌హ‌మ్మారి కాలం ఇది.. ప్ర‌జా ర‌వాణా సౌక‌ర్యాల‌ను వినియోగిస్తే వైర‌స్ సోకుతుంద‌న్న ఆందోళ‌న మ‌ధ్య దాదాపు ప్ర‌తి ఒక్క‌రూ సొంత వాహ‌నానికి ప్రాధాన్యం ఇస్తున్న టైం.. ఇప్ప‌టికే ప‌లు ద‌ఫాలు కార్లు, బైక్‌ల త‌యారీ సంస్థ‌లు ఇన్‌పుట్ కాస్ట్ పెరిగిపోయిందంటూ వాటి ధ‌ర‌లు పెంచేశాయి. తాజాగా మ‌రో ద‌ఫా కార్లు, బైక్‌ల ధ‌ర‌లు 10 నుంచి 20 శాతం వ‌ర‌కూ పెర‌గ‌బోతున్నాయి.

ఆటో రంగంపై టెక్నాల‌జీ ముద్ర ఇలా

దీనికీ ఓ కార‌ణం ఉంది.. టెక్నాల‌జీ అందుబాటులోకి వ‌చ్చాక దాన్ని ఆటోమొబైల్ రంగానికి వ‌ర్తింప‌జేస్తున్నారు. ఎల‌క్ట్రానిక్ గూడ్స్‌తోపాటు కార్లు, బైక్స్‌, స్కూట‌ర్ల‌లో చిప్స్‌, సెమీ కండ‌క్ట‌ర్ల వాడ‌కం పెరిగింది. సెమీ కండ‌క్ట‌ర్ల ధ‌ర‌లు పెంచితే ఇప్ప‌టికే భారీ టాక్స్‌ల‌తో స‌త‌మ‌తం అవుతున్న ఆటోమొబైల్ రంగంపై కోలుకోవ‌డం క‌ష్ట‌మేన‌న్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఇక ఎల‌క్ట్రానిక్ గూడ్స్ ధ‌ర‌లూ పెరుగుతాయ‌ని తెలుస్తోంది.

లాక్‌డౌన్‌.. వ‌ర్క్ ఫ్రం హోం క‌ల్చ‌ర్‌తో ఇలా డిమాండ్‌

- Advertisement -

అస‌లే వ‌ర్క్ ఫ్రం హోం క‌ల్చ‌ర్ పెరిగిపోవ‌డంతోపాటు క‌రోనా వ‌ల్ల లాక్‌డౌన్ అమ‌లు చేయ‌డంతో ప‌లు చిప్స్ త‌యారీ సంస్థ‌లు మూత ప‌డ్డాయి. కంపెనీలు త‌ర్వాత తెరుచుకున్నా.. ఆన్‌లైన్ క్లాస్‌లు, వ‌ర్క్ ఫ్రం హోంతోపాటు వాహ‌నాలు ప్ర‌తి ఒక్క‌రికి త‌ప్ప‌నిస‌రి అవ‌స‌రంగా మారాయి. అందుకే డిమాండ్‌కు అనుగుణంగా చిప్స్ త‌యారీలో కీల‌క‌మైన సెమీ కండ‌క్ట‌ర్ల కొర‌త నానాటికి పెరిగిపోతున్న‌ది. ఇప్ప‌టికే గ్లోబ‌ల్ ఆటో దిగ్గ‌జాలు త‌మ ఉత్ప‌త్తి ల‌క్ష్యాల్లో కోత విధించాయి.

20% ధ‌ర‌ల పెంపుకు సెమీ కండ‌క్ట‌ర్లు రెడీ?

ప్ర‌పంచంలోకెల్లా అతిపెద్ద సెమీ కండ‌క్ట‌ర్ల త‌యారీ సంస్థ తైవాన్ సెమీ కండ‌క్ట‌ర్ మాన్యుఫాక్చ‌రింగ్ కో (టీఎస్ఎంసీ) త‌మ ఉత్ప‌త్తుల ధ‌ర‌లు 20 శాతం వ‌ర‌కూ పెంచ‌డానికి స‌న్న‌ద్ధ‌మ‌వుతున్న‌ది. వ‌చ్చే ఆర్థిక సంవ‌త్స‌రం తొలి అర్థ‌భాగంలో సెమీ కండ‌క్ట‌ర్ల ధ‌ర‌లు పెంచ‌నున్న‌ట్లు టీఎస్ఎంసీ సంకేతాలిచ్చింది. మోస్ట్ అడ్వాన్స్డ్ చిప్స్ ధ‌ర‌లు 10 శాతం, ఆటో కంపెనీల్లో వాడే త‌క్కువ అడ్వాన్స్డ్ చిప్స్ ధ‌ర‌లు 15-20 శాతం పెరుగుతాయ‌ని వార్త‌లొచ్చాయి.

తైవాన్ సెమీ కండ‌క్ట‌ర్స్ ప్లాన్ ఇదీ

వినియోగ‌దారుల డిమాండ్‌కు అనుగుణంగా సెమీ కండ‌క్ట‌ర్ల ఉత్ప‌త్తిని పెంచాల‌ని టీఎస్ఎంసీ సంక‌ల్పించింది. అందుకోసం వ‌చ్చే మూడేండ్ల‌లో 100 బిలియ‌న్ డాల‌ర్ల‌కు పైగా నిధులు స‌మీక‌రించాల‌ని ప్ర‌ణాళిక రూపొందించింది. త‌ద్వారా కొత్త ఫ్యాక్ట‌రీలపై ఈ నిధుల‌ను పెట్టుబ‌డులుగా పెట్ట‌నున్న‌ది. ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఆటో రంగానికి చిప్స్ స‌ర‌ఫ‌రాలో ఈ ఏడాది ద్వితీయార్థంలో రిక‌వ‌రీ సాధిస్తార‌ని అంచ‌నా వేస్తున్నారు.

ఇలా చిప్స్ కొర‌త‌పై ఆటో అంచ‌నాలు

వ‌చ్చేనెలాఖ‌రుతో సెమీ కండ‌క్ట‌ర్ల స‌ర‌ఫ‌రాలో కొర‌త‌కు తెర ప‌డుతుంద‌ని టాటా మోటార్స్ అనుబంధ జాగ్వార్ లాండ్ రోవ‌ర్ (జేఎల్ఆర్‌) అంచ‌నా వేస్తోంది. దేశీయ ఐటీ దిగ్గ‌జ సంస్థ‌లు మ‌హీంద్రా అండ్ మ‌హీంద్రా, మారుతి సుజుకి, ఎచిర్ మోటార్స్ త‌దిత‌ర సంస్థ‌ల యాజ‌మాన్యాలు కూడా త‌మ ఉత్ప‌త్తిపై చిప్ సంక్షోభం ప్ర‌భావం చూపుతుంద‌ని తెలిపాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవి కూడా చ‌ద‌వండి:

JioPhone Next: వ‌చ్చే వార‌మే ఇండియాలో జియోఫోన్ నెక్ట్స్ ప్రి బుకింగ్స్‌!

Facial Recognition System : ఇండియ‌న్ రైల్వేస్ స‌రికొత్త ప్ర‌యోగం.. రైల్వే స్టేష‌న్ల‌లో ఫేసియ‌ల్ రిక‌గ్నిష‌న్ సిస్ట‌మ్స్‌

Youtube : షాకింగ్‌.. 10 ల‌క్ష‌ల వీడియోల‌ను తొల‌గించిన యూట్యూబ్.. కార‌ణం ఇదే

Koo : కోటి మంది యూజ‌ర్ల మార్క్‌కు చేరుకున్న‌ దేశీయ మైక్రోబ్లాగింగ్ ప్లాట్‌ఫామ్ ‘కూ’

Drone Rules 2021 : డ్రోన్ల‌పై ఉన్న ఆంక్ష‌ల‌ను తొల‌గించిన కేంద్రం.. ఇక నుంచి ఈజీ అప్రూవ‌ల్ సిస్ట‌మ్‌

Yahoo News : ఇండియాలో యాహూ షట్‌డౌన్.. ఇక నుంచి యాహూ న్యూస్ క‌నిపించ‌వు

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement