న్యూఢిల్లీ, సెప్టెంబర్ 25 : కార్ల తయారీలో అగ్రగామి సంస్థయైన మారుతి సుజుకీ వాహన విక్రయాలు టాప్‌గేర్‌లో దూసుకుపోయాయి. ప్రస్తుత నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటి వరకు 75 వేల యూనిట్ల వాహనాలను విక్రయించింది.
జీఎస్టీ తగ్గింపుతో చిన్న కార్ల ధరలు భారీగా తగ్గడంతో వాహన విక్రయాలకు కలిసొచ్చింది. గతంలో రోజుకు 40 వేల నుంచి 45 వేల వరకు ఎంక్వైరీలు వస్తుండగా, ప్రస్తుతం ఇది 80 వేలకు చేరుకున్నదని, అలాగే రోజు 18 వేల బుకింగ్‌లు జరుగుతున్నాయని మారుతి సుజుకీ ఇండియా సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి పార్థో బెనర్జీ తెలిపారు.