Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం వరుసగా రెండో సెషన్లో లాభాల్లో ముగిశాయి. ప్రపంచ మార్కెట్లలో సానుకూల పవనాలతో పాటు మెటల్ కొనుగోళ్లతో మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ప్రధాని నరేంద్ర మోదీ ట్రంప్ మధ్య చర్చల తర్వాత భారత్-యూఎస్ వాణిజ్య చర్చలపై సెంటిమెంట్ బలపడింది. క్రితం సెషన్‌తో పోలిస్తే 85,051.03 సెన్సెక్స్ పాయింట్ల వద్ద మొదలైంది. ఇంట్రాడేలో 84,956.74 పాయింట్ల కనిష్టానికి తాకిన సెస్సెక్స్.. 85,320.82 పాయింట్ల వద్ద గరిష్టానికి చేరింది. చివరకు 449.52 పాయింట్లు లాభపడి.. 85,267.66 వద్ద స్థిరపడింది. నిఫ్టీ సైతం 148.40 పాయింట్లు పెరిగి 26,046.95 వద్ద ముగిసింది.
టాటా స్టీల్, ఎటర్నల్, అల్ట్రాటెక్ సిమెంట్, ఎల్అండ్టీ, మారుతి సుజుకి, భారతి ఎయిర్టెల్, అదానీ పోర్ట్స్, యాక్సిస్ బ్యాంక్, బజాజ్ ఫైనాన్స్ నిఫ్టీలో అత్యధిక లాభాలను ఆర్జించాయి. టాటా స్టీల్, రేమాండ్స్ లైఫ్, జుబిలియంట్ ఫూడ్, డీసీఎం శ్రీరామ్, కెఫిన్ టెక్, హెచ్‌యూఎల్, పీఐ ఇండస్ట్రీస్, సన్ ఫార్మా, ఏషియన్ పెయింట్స్, ఐటీసీ, పవర్ గ్రిడ్, హెచ్‌సీఎల్ టెక్ అమ్మకాలతో ఒత్తిడికి గురయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 1.18 శాతం పెరగ్గా, నిఫ్టీ స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.94 శాతం వృద్ధిని నమోదు చేసింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్ 2.63 శాతం పెరిగింది. ఆ తర్వాత రియాల్టీ 1.53 శాతం, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 1.46 శాతం, ఆయిల్, గ్యాస్ 1.11 శాతం లాభపడ్డాయి. ఎఫ్ఎంసీజీ, మీడియా షేర్లు నష్టాల్లో ముగిశాయి. భారత్‌లో వెండి ఫ్యూచర్స్ చరిత్రలోనే తొలిసారిగా కిలోకు రూ.2లక్షల మార్క్‌ను దాటింది. ఈ ఏడాది వెండి దాదాపు 130శాతం పెరిగింది. ప్రపంచవ్యాప్తంగా బలమైన డిమాండ్, భౌగోళిక రాజకీయ పరిస్థితులు తదితర కారణాలతో వెండి ధర విపరీతంగా పెరిగింది.