Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం స్వల్ప నష్టాల్లో ముగిశాయి. భారత్-అమెరికా వాణిజ్య ఒప్పందంపై అనిశ్చితి, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ కొనసాగుతుండడం, డాలర్‌తో పోలిస్తే రూపాయి చారిత్రాత్మక కనిష్ట స్థాయికి పడిపోవడంతో మార్కెట్లు ఒడిదుడుకులను ఎదుర్కొన్నాయి. గత సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 84,891.75 పాయింట్ల నష్టాల్లో మొదలైంది. ఆ తర్వాత మార్కెట్లు కోలుకొని లాభాల్లోకి దూసుకెళ్లాయి. ఆ తర్వాత అమ్మకాలతో మార్కెట్లు మళ్లీ ఒత్తిడికి గురయ్యాయి. ఇంట్రాడేలో 85,278.63 పాయింట్ల గరిష్టానికి చేరిన సెన్సెక్స్.. 85,267.66 పాయింట్ల కనిష్టానికి చేరాయి.
చివరకు 54.30 పాయింట్లు తగ్గి 85,213.36 వద్ద ముగిసింది. నిఫ్టీ 19.65 పాయింట్లు తగ్గి 26,027.30 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో దాదాపు 2,067 షేర్లు లాభపడ్డాయి. 1,864 షేర్లు పతనమయ్యాయి. ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఐటీసీ, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, హెచ్‌యూఎల్, ట్రెంట్ నిఫ్టీలో అత్యధిక లాభాలను ఆర్జించాయి. ఓఎన్జీసీ, ఎంఅండ్ఎం, హెచ్డీఎఫ్సీ లైఫ్, ఐషర్ మోటార్స్, జేఎస్‌డబ్ల్యు స్టీల్ వంటి కంపెనీలు నష్టపోయాయి. రంగాల పరంగా పీఎస్‌యూ బ్యాంక్, మీడియా, ఐటీ, ఎఫ్ఎంసీజీ, కన్స్యూమర్ డ్యూరబుల్స్ 0.3 నుంచి ఒకశాతం వరకు పెరిగాయి. ఆటో, ఫార్మా, టెలికాం 0.5 నుంచి ఒకశాతం వరకు తగ్గాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగియగా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ 0.4శాతం పెరిగింది.