Share Market | ముంబై, జూలై 5: దేశీయ స్టాక్ మార్కెట్లు శుక్రవారం మిశ్రమంగా ముగిశాయి. నేషనల్ స్టాక్ ఎక్సేంజ్ (ఎన్ఎస్ఈ) సూచీ నిఫ్టీ 21.70 పాయింట్లు పెరిగి ఆల్టైమ్ హైని నెలకొల్పుతూ మునుపెన్నడూ లేనివిధంగా 24,323.85 వద్ద స్థిరపడింది. అయితే బాంబే స్టాక్ ఎక్సేంజ్ (బీఎస్ఈ) ప్రధాన సూచీ సెన్సెక్స్ మాత్రం 53.07 పాయింట్లు పడిపోయింది.
దీంతో 80 వేల మార్కుకు దిగువన 79,996.60 వద్ద నిలిచింది. కాగా, ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ మార్కెట్ విలువ రూ.48,723.54 కోట్లు ఎగిసి రూ.21,51,562.56 కోట్లకు చేరింది. కానీ హెచ్డీఎఫ్సీ బ్యాంక్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, ఇండస్ఇండ్ బ్యాంక్, అల్ట్రాటెక్ సిమెంట్, టాటా మోటర్స్, హెచ్సీఎల్ టెక్నాలజీస్, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి. అయినప్పటికీ బీఎస్ఈ నమోదిత సంస్థల మార్కెట్ విలువ ఆల్టైమ్ హైని తాకుతూ రూ.449.88 లక్షల కోట్లను తాకింది. ఒక్కరోజే రూ.2.48 లక్షల కోట్లు పెరిగింది.