Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెప్టెంబర్ 18న నిఫ్టీ 25,400 పైన భారత ఈక్విటీ సూచీలు లాభపడ్డాయి. ఫెడ్ రిజర్వ్ వడ్డీ కోత మార్కెట్లకు కలిసి వచ్చింది. క్రితం సెషన్‌తో పోలిస్తే సెన్సెక్స్ 83,108.92 పాయింట్ల వద్ద లాభాల్లో మొదలైంది. ఇంట్రాడేలో 82,704.92 పాయింట్ల కనిష్టాన్ని తాకిన సెన్సెక్స్.. 83,141.21 పాయింట్ల గరిష్టాన్ని తాకింది. చివరకు 320.25 పాయింట్ల లాభంతో 83,013.96 వద్ద ముగిసింది. నిఫ్టీ సైతం 93.35 పాయింట్లు పెరిగి 25,423.60 వద్ద స్థిరపడింది. దాదాపు 2,019 షేర్లు లాభపడగా.. 1,962 షేర్లు పతనమయ్యాయి. రంగాల వారీగా, ఐటీ ఇండెక్స్ 0.8 శాతం, ఫార్మా ఇండెక్స్ 1.5 శాతం, మెటల్ ఇండెక్స్ 0.3 శాతం, ప్రైవేట్ బ్యాంక్ ఇండెక్స్ 0.4 శాతం పెరిగాయి, ఆయిల్, మీడియా, క్యాపిటల్ గూడ్స్ సూచీలు ఒక్కొక్కటి 0.3 శాతం వరకు పతనమయ్యాయి. నిఫ్టీలో హెచ్డీఎఫ్సీ లైఫ్, ఇన్ఫోసిస్, ఎటర్నల్, సిప్లా, సన్ ఫార్మా ప్రధాన లాభాల పడగా.., కోల్ ఇండియా, బజాజ్ ఫైనాన్స్, ట్రెంట్, టాటా మోటార్స్, అల్ట్రాటెక్ సిమెంట్ నష్టపోయాయి. బీఎస్ఈ మిడ్‌క్యాప్ ఇండెక్స్ 0.3 శాతం పెరగ్గా.. స్మాల్‌క్యాప్ ఇండెక్స్ ఫ్లాట్‌గా ముగిశాయి.