Stock Market | దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం నష్టాల్లో ముగిశాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అంచనాలకు అనుగుణంగా కీలక వడ్డీ రేట్లను యథావిధిగా కొనసాగించింది. ఈ క్రమంలో సెన్సెక్స్ 5.5 శాతం వద్దే ఉంచింది. ఈ మేరకు ద్రవ్య పరపతి విధాన కమిటీ నిర్ణయాలను ఆర్బీఐ గవర్నర్ ప్రస్తుతం ఉన్న 5.5 శాతం రెపోరేటు కొనసాగుతుందని ప్రకటించారు. ఇదిలా ఉండగా.. దేశీయ స్టాక్ మార్కెట్లు బుధవారం ఉదయం 80,694.98 ఫ్లాట్‌గా మొదలైంది. ఇంట్రాడేలో 80,834.43 పాయింట్ల గరిష్టానికి పెరిగిన సెన్సెక్స్.. అత్యల్పంగా 80,448.82 పాయింట్లకు పడిపోయింది.
చివరకు 166.26 పతనమై.. 80,543.99 వద్ద ముగిసింది. నిఫ్టీ 75.35 పాయింట్లు తగ్గి 24,574.20 వద్ద స్థిరపడింది. బీఎస్ఈ మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ సూచీలు ఒక్కొక్కటి ఒకశాతం తగ్గాయి. నిఫ్టీలో విప్రో, సన్ ఫార్మా, జియో ఫైనాన్షియల్, ఇండస్ఇండ్ బ్యాంక్, టెక్ మహీంద్రా అత్యధికంగా నష్టపోగా.. ఏషియన్ పేయింట్స్, హెచ్డీఎఫ్సీ లైఫ్, ట్రెంట్, అదానీ పోర్ట్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ లాభపడ్డాయి. పీఎస్‌యూ బ్యాంక్ (0.6 శాతం) మినహా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, మీడియా, రియాల్టీ, ఫార్మా, ఎఫ్ఎంసీజీ ఒకటి నుంచి 2శాతం తగ్గాయి. ఇతర రంగాల సూచీలు నష్టాల్లో ముగిశాయి.