Manipal closer to Apollo | కోల్‌కతా కేంద్రంగా పని చేస్తున్న హాస్పిటల్స్ చైన్నెట్వర్క్ ఇమామీ అనుబంధ అమ్రీ దవాఖానల టేకోవర్‌కు బెంగళూరు కేంద్రంగా పని చేస్తున్న హాస్పిటల్ గ్రూప్ మణిపాల్ గ్రూప్ చర్చలు జరుపుతోంది. ఇప్పటికే ఎఫ్ఎంసీజీ మొదలు వంటనూనెలు, రియల్ ఎస్టేట్ నుంచి హెల్త్‌కేర్ రంగాల వరకు విభిన్న రంగాల్లో వ్యాపార లావాదేవీలు జరుపుతున్నది మణిపాల్ గ్రూప్.
ఈ విషయమై మణిపాల్ హాస్పిటల్స్ సీవోవో కార్తిక్ రాజగోపాల్ సంకేతాలిచ్చారు. 1300కి పైగా బెడ్ల సామర్థ్యం గల అమ్రీ హాస్పిటల్స్, దాని అనుబంధ ఆస్తులను కూడా టేకోవర్ చేయడానికి ఆసక్తిగా ఉన్నట్లు కార్తిక్ రాజగోపాల్ చెప్పారు. తద్వారా దేశంలోనే అతిపెద్ద హాస్పిటల్ నెట్వర్క్ అపోలో గ్రూప్‌తో పోటీ పడేందుకు ఉవ్విళ్లూరుతున్నది. తూర్పు భారత రాష్ట్రాల్లో విస్తరణకు అమ్రీ హాస్పిటల్స్ ఉపకరిస్తాయని రాజగోపాల్ తెలిపారు. అయితే, అమ్రీ హాస్పిటల్స్ నెట్వర్క్ టేకోవర్ చర్చలు ఇంకా ఖరారు కాలేదన్నారు.
కానీ ఇమామీ గ్రూప్ వర్గాలు దీనిపై స్పందించడానికి నిరాకరించాయి. కోల్‌కతాలోని సాల్ట్ లేక్, ముకుంద్‌పూర్, ధాకురియాల్లో అమ్రీ హాస్పిటల్ యూనిట్లు పని చేస్తున్నాయి. ప్రస్తుతం 7600 బెడ్స్‌తో మణిపాల్ దవాఖాన గ్రూప్ దేశవ్యాప్తంగా వైద్య సేవలందిస్తున్నది.
ఇది అపోలో గ్రూప్ కంటే సుమారు 1300-1400 బెడ్లు మాత్రమే తక్కువ. ఈ ఏడాది ప్రారంభంలో రూ.1500 కోట్లకు కొనుగోలు చేయడానికి అమ్రీ దవాఖానల గ్రూప్‌తో చర్చలు జరిపినట్లు కార్తిక్ రాజగోపాల్ తెలిపారు. ఇంతకుముందు బెంగళూరులోని విక్రమ్ దవాఖానలను కొనుగోలు చేసింది. తూర్పు ప్రాంతంలో విస్తరణ ద్వారా కొలంబియాలో అడుగు పెట్టాలని మణిపాల్ గ్రూప్ భావిస్తోంది.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
వజ్రాల వ్యాపారం చేస్తున్న ఏకైక మహిళ రాధిక మన్నె.. ఎవరామె.. ఆమె సక్సెస్ సీక్రెట్ ఏంటి?
jai bhim | ఈమెదీ చినతల్లి లాంటి కథే.. కానీ న్యాయం ఇంకా జరగలేదు !
Password : ఇండియన్స్ కామన్‌గా వాడే పాస్వర్డ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు
Red crabs : కోట్ల సంఖ్యలో రోడ్ల మీదికొచ్చిన పీతలు.. స్థంభించిన జనజీవనం.. ఎక్కడో తెలుసా?
బిచ్చగాడి అంతిమయాత్రకు భారీగా జనం.. కారణం ఏంటి?