హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ): టెక్నాలజీ, ఇతర పరిశ్రమల స్థాపనకు తెలంగాణ రాష్ట్రం అనుకూలమైన ప్రాంతమని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార తెలిపారు. సచివాలయంలో భట్టితో ఫ్రాన్స్ కాన్సుల్ జనరల్ మార్లేమి బృందం భేటీ అయిం ది.
ఈ సందర్భంగా రాష్ట్రంలో వనరులు, ఇతర అంశాలను అధ్యయనం చేయాల్సిందిగా ఆయన ఫ్రాన్స్ బృందానికి సూచించారు. ఈ సమావేశంలో ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియా, ట్రాన్స్‌కో సీఎండీ కృష్ణ భాసర్ తదితరులు పాల్గొన్నారు.