న్యూఢిల్లీ, ఆగస్టు 21: జీఎస్టీ స్లాబుల తగ్గింపునకు మరో ముందడుగుపడింది. రెండు స్లాబ్‌ల తగ్గింపునకు జీవోఎం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబులను రెండింటి తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయా రాష్ర్టాల ఆర్థిక మంత్రులతో ఏర్పాటైన మంత్రుల బృందం అనుమతినిచ్చింది.
దీంతో 12, 28 శాతం స్లాబులను ఎత్తివేసి కేవలం 5, 18 శాతం స్లాబులు మాత్రమే ఉండనున్నాయి. ఈ జీవోఎంకు బీహార్ ఉపముఖ్యమంత్రి సామ్రాట్ చౌదరితోపాటు ఆరుగురు సభ్యులుగా ఉన్నారు. జీఎస్టీ రేట్ల హేతుబద్దీకరణలో భాగంగా కేంద్రం కేవలం రెండు స్లాబులను ప్రతిపాదించిందని, దీనికి జీవోఎం ఆమోదం తెలిపిందని సామ్రాట్ చౌదరి తెలిపారు.