Infosys | హైదరాబాద్, ఆగస్టు 2 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): దేశీయ ఐటీ దిగ్గజాల్లో ఒకటైన ఇన్ఫోసిస్ కంపెనీ రూ. 32,403 కోట్ల జీఎస్టీ ఎగవేతకు సంబంధించి కర్ణాటక స్టేట్ జీఎస్టీ అధికారులు ముందస్తు షోకాజ్ నోటీసులు పంపడంపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. ఐటీ ఉద్యోగులు వారంలో 70 గంటలు పనిచేయాలన్న నారాయణ మూర్తి కామెంట్లను ఈ సందర్భంగా గుర్తుచేస్తున్నారు.
ఇన్ఫోసిస్ జరిమానా కట్టడానికి ఎక్కువ గంటలు పనిచేయాల్సిందేనని పోస్టులు పెడుతున్నారు. కాగా ఎగవేతకు సంబంధించిన నోటీసులను వెనక్కి తీసుకొంటున్నట్టు జీఎస్టీ అధికారులు తాజాగా వెల్లడించడం గమనార్హం.