Jio Phones | జియో నుంచి రెండు స్మార్ట్ ఫోన్లు.. రిలీజ్ ఎప్పుడంటే..?!
Jio Phones | రిలయన్స్ జియో త్వరలో రెండు ఎంట్రీ లెవల్ స్మార్ట్ ఫోన్లను ఆవిష్కరించనున్నదని తెలుస్తోంది. ఈ నెల 28న జరిగే రిలయన్స్ ఏజీఎం సమావేశంలో జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ ఓ ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
Jio Phones |రిలయన్స్ జియో త్వరలో రెండు స్మార్ట్ ఫోన్లను భారత్ మార్కెట్లో ఆవిష్కరించనున్నదని తెలుస్తున్నది. అధికారికంగా జియో వెల్లడించకున్నా.. ఆ రెండు ఫోన్లకు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (బీఐఎస్) సర్టిఫికెట్ పొందినట్లు తెలుస్తున్నది. ఈ నెల 28న జరిగే రిలయన్స్ వార్షిక సమావేశం (ఏజీఎం)లో ఈ జియో ఫోన్ల ఆవిష్కరణపై ఒక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నది.
స్నాప్ డ్రాగన్ 480 ఎస్వోసీ చిప్ సెట్ తో 4జీబీ రామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో రిలయన్స్ జియో ఫోన్లు వస్తున్నాయని సమాచారం. జియో స్మార్ట్ ఫోన్లు జేబీవీ161డబ్ల్యూ1, జేబీవీ162డబ్ల్యూ1 అనే పేర్లతో వినియోగదారులకు అందుబాటులోకి రానున్నయని వినికిడి. ఈ నెల 20న జరిగే రిలయన్స్ వార్షిక సర్వసభ్య సమావేశంలో రిలయన్స్ జియో చైర్మన్ ఆకాశ్ అంబానీ జియో ఫోన్లపై ఒక ప్రకటన చేస్తారని భావిస్తున్నారు. చౌక ధరకే జియో స్మార్ట్ ఫోన్లు వినియోగదారులకు అందుబాటులో ఉన్నాయి. జియో ఫోన్ల ధర రూ.8000, 12 వేల మధ్య నిర్ణయిస్తారని సమాచారం.
4జీబీ రామ్ విత్ 32 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో వస్తున్న రెండు జియో ఫోన్లు డ్యుయల్ రేర్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రధాన కెమెరా 13-మెగా పిక్సెల్ ప్రైమరీ సెన్సర్ తోపాటు సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 8-మెగా పిక్సెల్ కెమెరా ఉంటుంది. 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ విత్ 18 వాట్ల చార్జింగ్ సపోర్ట్ ఉంటుంది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

