హైదరాబాద్, ఏప్రిల్ 13: రిలయన్స్ జియో..తాజాగా రాష్ట్రంలో మరో 14 నగరాల్లో తన 5జీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో మొత్తం 33 నగరాల్లో 5జీ సేవలు ప్రారంభించినట్టు అయిందని జియో తెలంగాణ సీఈవో కేసీ రెడ్డి తెలిపారు.
తాజాగా కామారెడ్డి, మిర్యాలగూడ, పాల్వంచ, గద్వాల్, ఆర్మూర్, సిరిసిల్ల, భువనగిరి, బోధన్, వనపర్తి, బెల్లంపల్లి, కాగజ్నగర్, పెద్దపల్లి, కోరుట్ల, మందమర్రి నగరాల్లో ఈ సేవలను ప్రారంభించింది. జియో వినియోగదారులు జియో వెల్కం ఆఫర్ కింద 1జీబీపీఎస్ వేగంతో అపరిమిత డాటాను పొందవచ్చును.