Bluesky | ట్విట్టర్‌కు పోటీ వచ్చేసింది.. బ్లూ స్కైని పరిచయం చేసిన జాక్ డోర్సే
Bluesky | ట్విట్టర్ (Twitter) సహవ్యవస్థాపకుడు (co-founder), మాజీ సీఈవో జాక్ డోర్సే (Jack Dorsey) తన కొత్త సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశారు. కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం (New Socialmedia Platform) ‘బ్లూస్కై’ (Bluesky) బీటా వర్షెన్‌ను విడుదల చేశారు.
Bluesky | ట్విట్టర్ (Twitter) సహవ్యవస్థాపకుడు (co-founder), మాజీ సీఈవో జాక్ డోర్సే (Jack Dorsey) తన కొత్త సామాజిక మాధ్యమాన్ని పరిచయం చేశారు. కొత్త సోషల్ మీడియా ప్లాట్‌ఫాం (New Socialmedia Platform) ‘బ్లూస్కై’ (Bluesky) బీటా వర్షెన్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఇది యాపిల్ యాప్ స్టోర్ (Apple App Store)లో ఎంపిక చేసిన యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉంది. అథెంటికేటెడ్ ట్రాన్స్ఫర్ ప్రొటోకాల్‌పై ఆధారపడి ఇది పనిచేస్తుంది. అంటే కేవలం ఒక సైట్ ద్వారా మాత్రమే కాకుండా పలు సైట్ల ద్వారా ఇది పనిచేస్తుందన్నమాట.
యాప్ ఇంటెలిజెన్స్ సంస్థ అందించిన వివరాల ప్రకారం (according to app intelligence firm data.ai) .. ఐవోఎస్ యాప్ (iOS app) స్టోర్‌లో ‘బ్లూస్కై’ (Bluesky) ఫిబ్రవరి 17నే అందుబాటులోకి వచ్చింది. ఇక ఇది వచ్చినప్పటినుంచి టెస్టింగ్ దశలోనే 2,000 మంది వరకు ఇన్స్టాల్ చేసుకున్నారు. దీని యూజర్ ఇంటర్ఫేజ్ డిజైన్ చాలా సింపుల్‌గా ఉంది. యాప్‌లో ఉండే ప్లస్ బటన్‌ను క్లిక్ చేసి.. 256 క్యారెక్టర్లతో పోస్ట్‌ను క్రియేట్ చేసేలా దీనిని డిజైన్ చేశారు. ఫొటోస్‌తో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. ట్విట్టర్ పోస్ట్ బాక్స్‌లో ‘What is Happening?’ అని ఉంటుందన్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ‘బ్లూస్కై’ (Bluesky) లో మాత్రం ‘Whats Up?’ గా కనిపించనుంది. ఇందులో షేర్ (Share), మ్యూట్ (Mute), బ్లాక్ అకౌంట్స్ (block accounts) వంటి ఫీచర్లు సైతం ఉన్నట్లు సంస్థ పేర్కొంది.
యాప్ నావిగేషన్స్ మధ్యలో డిస్కవర్ (Discover) ట్యాబ్‌ను ‘బ్లూస్కై’ (Bluesky) తీసుకొచ్చినట్లు డేటా.ఏఐ తెలిపింది. ఎవరిని ఫాలో చేయాలి? రీసెంట్ పోస్ట్‌లు వంటి వాటిని శోధించడానికి ఇది ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొంది. ఇక వేరే ట్యాబ్‌లో నోటిఫికేషన్స్, లైక్స్, రీపోస్టులు, రిప్లైలు, ఫాలోస్.. ఇలా ట్విట్టర్లో ఉన్నటువంటి ఫీచర్లు ఇందులో ఉన్నట్లు తెలుస్తోంది.
జాక్ డోర్సే (Jack Dorsey) 2021 నవంబర్‌లో ట్విట్టర్ సీఈవో పదవి బాధ్యతల నుంచి దిగిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత బోర్డు నుంచి కూడా తప్పుకోవడంతో ట్విట్టర్ నుంచి పూర్తిగా దూరమయ్యారు. ట్విట్టర్ సీఈవోగా పరాగ్ అగర్వాల్ ఎంపికవ్వడం, ఆ తర్వాత ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేయడం వంటివి చకాచకా జరిగిపోయాయి. ట్విట్టర్‌ను మస్క్ హస్తగతం చేసుకున్నాక సంస్థలో చాలా మార్పులు జరిగాయి. వీటిపై చాలా వ్యతిరేకత కూడా వ్యక్తమైంది. ట్విట్టర్ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీగా ఉండేకన్నా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగానే ఉండటం మంచిదనే అభిప్రాయాన్ని అప్పట్లో జాక్ డోర్సే (Jack Dorsey) వెల్లడించారు. ఆ సంస్థలో జరిగిన పరిణామాలపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. అనంతరం తన డీసెంట్రలైజ్డ్ ‘బ్లూ స్కై’ సోషల్ యాప్ బీటా పరీక్షలకు వెళ్లనున్నట్టు గతేడాది జాక్ డోర్సే ప్రకటించారు.
Also Read..
Virushka | అనుష్క త్యాగాలు చాలా గొప్పవి.. భార్యపై కోహ్లీ ప్రశంసల వర్షం
Bomb threats | ప్రముఖ నటులు అమితాబ్, ధర్మేంద్ర నివాసాలకు బాంబు బెదిరింపులు
AAP | ఢిల్లీ కేబినెట్లోకి ఇద్దరు కొత్త మంత్రులు.. ప్రకటించిన ఆప్
Viral News | పొద్దున్నే నక్క ముఖం చూశాడు.. సాయంత్రానికే కటకటాలపాలయ్యాడు..!
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Without Breathing | శ్వాస తీసుకోకుండా ఎక్కువ సేపు ఉండవచ్చా.. దీన్ని అభ్యాసం చేయవచ్చా..?
Fauzi | ప్రభాస్ బర్త్ డే గిఫ్ట్‌కు ఫిదా అయిపోయిన ‘ఫౌజీ’ భామ ఇమాన్వీ
CJP protest | మళ్లీ నిరసనలకు పిలుపునిచ్చిన సీజేపీ.. అక్టోబర్ 16న లెహ్రా దో తిరంగా పేరుతో ఆందోళన
KTR | సింగరేణి కార్మికులు తిరగబడితే ఆనాడు దక్షిణాది రాష్ట్రాలు చిమ్మ చీకట్లో ఉండిపోయినయి : కేటీఆర్
Rahul Gandhi | మా వ్యాపారాలు దెబ్బతింటున్నాయి.. నిరసనలు ఆపండి.. మోదీకి, రాహుల్ గాంధీకి వ్యాపారుల వినతి
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

