IT Returns | ఐటీఆర్ గడువు పొడిగింపు..? స్పష్టతనిచ్చిన ఐటీ విభాగం
IT Returns | 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ గడువు పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి.
IT Returns | 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ ఆదాయ పన్ను రిటర్ను (ఐటీఆర్)ల దాఖలుకున్న గడువు నేటితో ముగియనున్న విషయం తెలిసిందే. అయితే, ఈ గడువు పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయి. సెప్టెంబరు 30 వరకూ గడువు పొడిగించినట్లు తెగ ప్రచారం జరుగుతోంది (ITR deadline extension rumours). ఈ ప్రచారంపై ఐటీ విభాగం (Income Tax Department) స్పష్టతనిచ్చింది. అవన్నీ ఫేక్ వార్తలని తేల్చి చెప్పింది. ఐటీ రిటర్నుల (ITR Deadline) దాఖలుకు ఎలాంటి పొడిగింపు లేదని స్పష్టం చేసింది.
ఐటీఆర్ (IT Returns) ఫైలింగ్ గడువును ఇప్పటికే జులై 31 నుంచి సెప్టెంబరు 15 వరకు పొడిగించినట్లు గుర్తు చేసింది. దీన్ని సెప్టెంబరు 30వ తేదీ వరకు పొడిగించినట్లు వార్తలు వస్తున్నాయని.. ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. ఐటీ రిటర్ను దాఖలుకు నేడే (సెప్టెంబరు 15) చివరి తేదీ అని వెల్లడించింది. సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మొద్దని సూచించింది. ఆదాయపు పన్ను విభాగం అధికారికంగా ఇచ్చే అప్డేట్లను మాత్రమే అనుసరించాలని తెలిపింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసేవారికి ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు హెల్ప్డెస్క్ 24 గంటలు పనిచేస్తున్నదని, ముఖ్యంగా కాల్స్, లైవ్ చాట్స్, ఎక్స్ ద్వారా సమాధానాలు ఇస్తున్నట్టు పేర్కొంది. ఈ మేరకు ఐటీ విభాగం తమ అధికారిక ఎక్స్ ఖాతాలో ప్రకటన విడుదల చేసింది.
మరోవైపు అసెస్మెంట్ ఇయర్ 2025-26కిగాను ఇప్పటి వరకు ఆరు కోట్లకు పైగా ఐటీ రిటర్నులు దాఖలు చేసినట్టు ఆదాయ పన్ను మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఐటీ రిటర్నులు దాఖలు చేసినవారందరికి కృతజ్ఞతలు..వీరి వల్లనే కీలక మైలురాయి 6 కోట్లను అధిగమించినట్టు తెలిపింది.
Also Read..
GST Reforms | రుణాలను రద్దు చేసుకుంటున్న కార్ల కొనుగోలుదారులు.. ఆందోళనలు బ్యాంకులు..!
మీకిది తెలుసా?.. ఎస్ఎఫ్టీ రిటర్నుల ద్వారా ఐటీ శాఖకు లావాదేవీల వివరాలు
లాంజ్ల్లో లగ్జరీ ఆతిథ్యం.. విమానాశ్రయాల్లో దొరికేవి ఉచితాలేనా?
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
దూదేకుల స్థితిగతులపై ప్రత్యేక సర్వే
ఖాళీలు 2,125.. భర్తీ 429 మాత్రమే.. యూనివర్సిటీల్లో టీచింగ్ పోస్టుల భర్తీపై సర్కార్ నిర్లక్ష్యం
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

